Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తున్న వైఎస్ షర్మిల, గిరిజనులతో నృత్యం

YS Sharmila

ఐవీఆర్

, శనివారం, 10 ఫిబ్రవరి 2024 (23:34 IST)
కర్టెసి-ట్విట్టర్
కాంగ్రెస్ పార్టీ. ఏపీ విభజన అనంతరం కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభలు, రోడ్ షోలు చేయాలంటే భయపడే పరిస్థితి అప్పట్లో. కానీ ప్రస్తుతం వైఎస్సార్ కుమార్తె, ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మెల్లగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆమె చేస్తున్న రోడ్ షోకి ప్రజలు మెల్లగా స్పందిస్తున్నారు. రోడ్ షోలో జగనన్న పాలనను ఎండగడుతున్నారు షర్మిల. జగనన్న చేసింది ఏమీ లేదనీ, 8 లక్షల కోట్లు అప్పు చేసారు తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని ప్రతి సభలోనూ ఆమె చెబుతున్నారు.
 
ఈరోజు పాడేరులో ఆమె సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్లో... '' పాడేరు బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జానీకానికి, అభిమానులకు, కార్యకర్తలకు నాయకులకు నా ధన్యవాదాలు. ఈ పాడేరు ప్రాంతమన్నా.. ఆదివాసీయులన్నా YSRకి ఎంతో అభిమానం. వైయ‌స్ఆర్ హయాంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. రోడ్లు, కాలేజీలు, ఆసుపత్రులు అన్ని ఆయన కట్టించారు. వైయ‌స్ఆర్ వేసిన రోడ్లే ఈరోజుకి దిక్కు.
 
ఇప్పటి ప్రభుత్వానికి గిరిజనుల అభివృద్ధిపై శ్రద్ద లేదు. సరైన రోడ్లు లేక గర్భిణులు చనిపోతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనీసం త్రాగునీటి సౌకర్యం లేదు అంటేనే తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి ఆదివాసీయులపై చిత్తశుద్ధి ఏంటనేది. ఈ ప్రాంతం బాగుపడాలన్నా ఆదివాసీయుల జీవన స్థితిగతులు మారాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకే ఆలోచించి ఓటు వెయ్యండి. మీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వంతల సుబ్బారావు గారిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి." అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చౌమాన్ హైదరాబాద్‌లో భాగస్వామితో కలిసి చైనీస్ మీల్‌ టేస్ట్ చేయండి