Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్ 3 రోజుల హడావుడి... పవన్ పైన జగన్ పవర్ పంచ్‌లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా 3 రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్ల

Advertiesment
జస్ట్ 3 రోజుల హడావుడి... పవన్ పైన జగన్ పవర్ పంచ్‌లు
, శుక్రవారం, 8 డిశెంబరు 2017 (16:30 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా 3 రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్లుగా వుందన్నారు. ఎంతమాత్రం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 
 
వైసీపీ ఎమ్మెల్యేల బృందం పోలవరం ప్రాజెక్టును చూసేందుకు వెళితే... వారి వెంట ఈయన కూడా వెళ్లారన్నారు. సినిమాలు తీసుకుంటూ వుండే పవన్ ఏది చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగానే వుంటుందంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని పవన్ అనడంపై మండిపడ్డారు. ఆయనేమైనా ప్రత్యక్షంగా చూశారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతితో కొట్టుకుంటుంటే మరి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి అందులో ఎలా కలిపారూ... దీనికి ఫలితంగా ఎంత అవినీతి జరిగిందీ అంటూ ప్రశ్నించారు. 
 
ఒకరిని విమర్శించే ముందు మీ గురించి ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు. పార్టీని స్థాపించడం గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడు స్థాపించారని నిలదీశారు. అవినీతి, అక్రమాల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఆయన తమపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారనీ, ఆయన చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారా అని సందేహాన్ని వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిస్సహాయుడిని.. కన్నీళ్లు బయటికి రాకుండా రోదించా : పీఆర్పీ విలీనంపై పవన్