Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ జగన్ మెట్రో రైలు ఎక్కగలడు దిగగలడు.. చంద్రబాబు ఇక మెట్రో జోలికి వెళ్లడు.. ఎందుకు?

మావోయిస్టులనుంచీ, ఎర్రచందనం స్మగ్లర్ల వరకూ చంద్రబాబుకు శత్రువుల ప్రమాదం ఎక్కువ కావడంతో ఇక మెట్రోరైలు ప్రయాణం బాబుకు ప్రమాదకరం అని ఏపీ నిఘా విభాగం తేల్చి చెప్పింది. ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత ఉన్న ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం ఇందుకు సంబ

వైఎస్ జగన్ మెట్రో రైలు ఎక్కగలడు దిగగలడు.. చంద్రబాబు ఇక మెట్రో జోలికి వెళ్లడు.. ఎందుకు?
హైదరాబాబ్ , గురువారం, 11 మే 2017 (02:29 IST)
ప్రధాని నరేంద్రమోదీతో బేటీ కావడానికి ముందు బుధవారం ఢిల్లీలో మెట్రో రైలులో పయనించిన వైఎస్ జగన్ ఆ తర్వాత ప్రధానితో నేరుగా సమావేశమై అరగంటపాటు చర్చించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దేశరాజధానికి వెళ్లిన ప్రతి ప్రముఖ రాజకీయ నాయకుడూ అక్కడి మెట్రో రైలులో ప్రయాణించి ఆ అనుభవాన్ని ప్రశంసించడం పరిపాటిగా మారింది. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం ఇకపై మెట్రో రైలులో ప్రయాణించే భాగ్యం మూసుకుపోయినట్లే అంటున్నారు. 
 
సమయ పాలన కోసం చంద్రబాబు మెట్రో రైలులో ప్రయాణించరు అనుకుందామా అంటే కాదు. మావోయిస్టులనుంచీ, ఎర్రచందనం స్మగ్లర్ల వరకూ చంద్రబాబుకు శత్రువుల ప్రమాదం ఎక్కువ కావడంతో ఇక మెట్రోరైలు ప్రయాణం బాబుకు ప్రమాదకరం అని ఏపీ నిఘా విభాగం తేల్చి చెప్పింది. ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత ఉన్న ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం ఇందుకు సంబంధించి తీవ్ర నిర్ణయం ప్రకటించింది. 
 
చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో మెట్రో ప్రయాణం మంచిది కాదని నిఘా విభాగం స్పష్టం చేసింది. విమానాశ్రయం నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోనే తీసుకురావాలని నిఘా విభాగం తెలిపింది. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌కు రాష్ట్ర నిఘా విభాగం ఆదేశాలు ఇచ్చింది. ఉగ్రవాదులు, మతచాందసవాదులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముప్పు ఉందని రాష్ట్ర నిఘా విభాగం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
 
గత అక్టోబర్‌లో ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులపై మెరుపు దాడి చేసిన ఏపీ పోలీసు బలగాలు 35 మందికి పైగా మావోయిస్టులను హతమార్చడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ కేంద్ర నాయకత్వం చంద్రబాబును ఇక వదలకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఢిల్లీలోని ఏపీ రెసిడెన్స్ భవనంలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని, హైదరాబాద్‌లో చంద్రబాబు నూతన గృహ ప్రవేశం సందర్భంగా మావోయిస్టు మహిళా కార్యకర్త చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఫ్రెండ్‌ని అని చెప్పుకుని ఆ ఇంట్లో దూరి ఫొటోలు తీసి పట్టుబడిన వైనం కూడా తెలిసిందే. 
 
అటు మావోయిస్టుల బెడద, ఇటు ఎర్రచందనం స్మగ్లర్ల ప్రతీకారం అన్నీ కలిపి చంద్రబాబు భద్రతపై బలగాలకు భీతి పట్టుకుందని, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కదలికలను కూడా పూర్తిగా నియంత్రిస్తున్నారని తెలుస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?