Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాయిదాల పర్వంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

Advertiesment
YS Jagan Mohan Reddy Illegal Assets Case
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో వాయిదాల పరంపర కొనసాగుతోంది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15వ తేదీన జరగాల్సిన విచారణను, 20వ తేదీ వాయిదా వేయగా, మంగళవారం విచారణకు రావాల్సిన కేసుల విచారణ మళ్లీ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. 
 
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండటంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. మెట్రో పాలిటన్‌ సెషన్‌ జడ్జి(ఎంఎస్‌జే) పరిధిలో ఉన్న ఈడీ కేసు నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. 
 
కాగా, జగన్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబరు 5వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. సీఎం జగన్‌కు సంబంధించిన అన్ని కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉండగా, ఈడీ కేసు మాత్రం ఎంఎస్‌జే కోర్టు విచారణలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగరాజు ఆత్మహత్య : పరువు కోసమా.. పైవారి కోసమా..???