నేను, అమ్మ, పాప ముగ్గురం అడిగినా ఆమె ఒప్పుకోలేదు: జగన్
దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణానికి అనంతరం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర కొన్ని జిల్లాల వరకే పరిమితం అయ్యింది. ఈ యాత
దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణానికి అనంతరం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర కొన్ని జిల్లాల వరకే పరిమితం అయ్యింది. ఈ యాత్ర ద్వారా జగన్‌కు యమా క్రేజ్ వచ్చింది.
కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమతి ఇవ్వలేదు. దీంతో జగన్‌కు - సోనియా గాంధీకి విబేధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా జగన్ కాంగ్రెస్ నుంచి వైదొలగి.. కొత్త పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజాగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోనియా గాంధీతో ఏర్పడిన వివాదానికి కారణాలేంటో చెప్పారు. తాను, అమ్మ, పాప ముగ్గురం కలిసి చివరిగా సోనియా గాంధీని విజ్ఞప్తి చేశామని., కానీ ఆమె ఒప్పుకోలేదు.
సోనియా గాంధీ ఆ రోజే అంగీకరించివుంటే సమస్య ఇంతదూరం వచ్చేది కాదని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఓదార్పు యాత్రకు ఆమె పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఓదార్పు యాత్ర చేపట్టానని జగన్ వివరించారు.