సాయుధ దళాల పతాక దినోత్సవం: ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ
డిసెంబర్ 7వ తేదీన దేశ వ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులను, మాజీ సైనికులను, వారి కుటుంబాల గౌరవార్ధం పునఃస్మరించుకుంటున్నాం. త్రివిద సైనిక దళాలలో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపటానికి ఈ స
డిసెంబర్ 7వ తేదీన దేశ వ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులను, మాజీ సైనికులను, వారి కుటుంబాల గౌరవార్ధం పునఃస్మరించుకుంటున్నాం. త్రివిద సైనిక దళాలలో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపటానికి ఈ సాయుధ దళాల పతాక దినోత్సవం ఎంతగానో దోహదపడుతుంది. ఈ రోజు నుండి ప్రజలు, పారిశ్రామికవేత్తల వద్ద నుండి విరివిగా స్వచ్ఛంద విరాళాలను సేకరించటం జరుగుతుంది. ఇలా సేకరించిన విరాళాలతో రాష్ట్రస్థాయిలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చైర్మెన్‌షిప్‌లో పతాక దినోత్సవ నిధిని ఏర్పాటు చేసారు. ఈ నిధిని త్రివిద సైనిక దళాల మాజీ సైనికుల మరియు మాజీ సైనిక వితంతువుల కుటుంబాల సంక్షేమార్ధం వినియోగించటం జరుగుతుంది.
ఈ సందర్భంగా కమోడోర్ ఎం.వి.ఎస్. కుమార్, వి.ఎస్.ఎం, సంచాలకులు, శ్రీమతి టి. స్వర్ణకుమారి, సహాయ సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శ్రీ దినేష్ కుమార్ ఐ.ఎ. యస్, శ్రీమతి ఎఆర్ అనురాధ, ఐ.పి.యస్, ప్రధాన కార్యదర్శి, అంతరంగిక శాఖ వారిని కలిసి స్టిక్కర్ ఫ్లాగ్‌ను అలంకరించి స్వచ్ఛంద విరాళాలను హుండీ బాక్స్ ద్వారా సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలు, పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలను సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారికి పంపవలిసినదిగా కోరడమైనది. ఈ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు వుంది.
సాయుధ దళాల పతాకనిధికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ ఏటా రూ.50 చొప్పున, అధికారులు రూ.100 చొప్పున విరాళాలు అందిస్తారు. ఎవరైనా ఈ నిధికి విరాళాలు అందించాలనుకొంటే రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లేదా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ అధికారిని ఈక్రింది అడ్రస్‌లో సంప్రదించవచ్చును-
సైనిక సంక్షేమ సంచాలకుని కార్యాలయము
డోర్ నెం.32-14-2C, శివ అపార్ట్ మెంట్ ఎదురుగా
శివాలయం దగ్గర, మొఘల్రాజపురం
విజయవాడ-520 010.
ఫోన్ నెం.0866-2471233 & 2473331