Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ జగన్‌ను కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం.. ఎక్కడ.. ఎందుకు?

Advertiesment
brahmanandam ys jagan
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఈ అరుదైన కలయిక జరిగింది. తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్లేందుకు జగన్ విమానాశ్రయానికి చేరుకోగా, అదేసమయంలో హైదరాబాద్ నుంచి తన వ్యక్తిగత పనిమీద బ్రహ్మానందం గన్నవరంకు చేరుకున్నారు. 
 
ఆ సమయంలో వారిద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బ్రహ్మానందం యోగక్షేమాలను, ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వీరి కలయికకు సంబంధించి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కనిపించడం లేదు... 
 
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, మృతదేహం డోర్ డెలివరీ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మి ఇపుడు కనిపించడం లేదు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో లక్ష్మీదుర్గ పేరును చేర్చారు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయారు. 
 
ఈ హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం ఉన్నట్టు కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. ఆమెను ఈ కేసులో ఏ2గా పేర్కొంటూ రాజండ్రి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీదుర్గం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ, అడ్డతీగలలో ఆమె లేదని, ఆమె పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
మరోవైపు, హత్య జరిగినపుడు తాను తమ బంధవులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాలని గతంలో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని, హత్య జరిగిన రాత్రి అనంతపురంలో పాటు ఆమె కారులోనే ఉందని సీసీ కెమెరా విజువల్స్ ద్వారా సిట్ టీమ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఏ-2గా పోలీసులు చేర్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్ ప్రక్రియలో సాయం కోసం జ్యూడిషియ అధికారుల నియామకం : సుప్రీంకోర్టు ఆదేశం