Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

Advertiesment
jagan

ఠాగూర్

, మంగళవారం, 8 జులై 2025 (17:21 IST)
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వైకాపా మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఆవరణలోని అనే వస్తువులతో పాటు కారును కూడా ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో నల్లపురెడ్డి, ఆయన కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
 
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధినేత తనకు ధైర్యం చెప్పారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
 
దాడి సమయంలో తాను ఇంట్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాడిని కాదని ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన వారే ఈ అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించార
ని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ ఇలా దాడులకు పాల్పడడం నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదని అన్నారు.
 
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకు తాను ప్రతి విమర్శలు చేశానని గుర్తు చేశారు. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై స్పందించాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...