Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలిసినోడే కదా అని బైకెక్కితే... మార్గమధ్యంలో కిందపడేసి ఆ పని చేశాడు...

Advertiesment
తెలిసినోడే కదా అని బైకెక్కితే... మార్గమధ్యంలో కిందపడేసి ఆ పని చేశాడు...
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:10 IST)
కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. తెలిసినోడే కదా అని బైకు ఎక్కినందుకు ఆ మహిళ రేప్‌కు గురైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి అనే గ్రామానికి చెందిన ఓ మహిళ... తన వ్యక్తిగత పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చింది. 
 
అక్కడ తన పని ముగించుకుని తిరుగు ప్రయాణమైంది. ఇంతలో తమ గ్రామానికే చెందిన మేకల సురేష్ అనే యువకుడు బైకుపై కనిపించడంతో పలుకరించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బైకు ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆ వ్యక్తి తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. 
 
బైకును ఆపి.. ఆ మహిళను బలవంతంగా కిందపడేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న బాధిత మహిళ.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాపై ఈగ వాలితే అక్కాచెల్లెళ్ళే తోలుతీస్తారు... ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా?