Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమోన్మాది దారుణం : అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి ప్రియురాలి హత్య

Advertiesment
ప్రేమోన్మాది దారుణం : అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి ప్రియురాలి హత్య
, బుధవారం, 10 నవంబరు 2021 (08:39 IST)
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ యువకుడు అతి క్రూరంగా నడుచుకున్నాడు. తన ప్రేమను అంగీకరించడం లేదన్న కోపంతో ఉన్మాదిగా మారిపోయాడు. తాను మనసుపడిన యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ కిరాతక చర్యకు పాల్పడే సమయంలో ఆ యువతి అరుపులు ఇతరులకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి హత్య చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోదావరిఖనిలోని ఐటింక్లైన్ కాలనీ కేకేనగర్‌కు చెందిన గొడుగు అంజలి (20) అనే యువతి తన తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది. తల్లి కూలిపనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండేది. 
 
దీన్ని గమనించిన చాట్ల రాజు (20) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తన ఇంటికి రావొద్దని అతడికి పలుమార్లు హెచ్చరిక చేసింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.
 
ఇదిలావుంటే, అంజలికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. వారి కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు కోశాడు. ఆపై ఇంట్లోని కత్తిపీటతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
 
అంజలి తల్లి లక్ష్మితో కలిసి పనిచేసే ఓ వ్యక్తి ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం వారింటికి వెళ్లాడు. ఎంతగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా ఉండటంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న అంజలి మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. తేరుకుని బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు.  
 
ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, అంజలిని హత్య చేసిన రాజు అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పంలో ఉద్రిక్తత : మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్టు.. ఖాకీల వార్నింగ్