Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుప్పంలో దూకుడు పెంచిన వైసీపీ: పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి..?

Advertiesment
YCP Targets Kuppam
, బుధవారం, 8 డిశెంబరు 2021 (16:05 IST)
కుప్పం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి అధికారపార్టీ వైసీపీ కేంద్రంగా కీలమైన డెవలప్‌మెంట్ జిల్లా రాజకీయాల్లో చర్చకు కారణమైంది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్‌లో వైసీపీ జెండా ఎగరేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్.
 
కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో 25 వార్డుల్లో 19చోట్ల గెలిచి సత్తాచాటి.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే మా టార్గెట్ అని మాటల తూటాలు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి. 2024లో కుప్పం తమదేనని ప్రకటించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాపం అంటూ సెటైర్లు వేశారు.
 
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడు భరత్‌కు అప్పగించారు. ఇప్పుడు భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. కుప్పం కొత్త సారథి కోసం సీరియస్‌గా దృష్టి పెట్టారట. ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచే ఉంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెలికాఫ్టర్‌లో ఎవరెవరు ప్రయాణించారంటే...