Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ అంటే దొంగల పార్టీయా? లేక దుర్యోధనుల పార్టీయా? రోజా ప్రశ్న

టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీయా? లేక దొంగల పార్టీయా? దుర్యోధనుల పార్టీయా? అంటూ ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై హైదరాబాదులో ఏర్పాటు చే

Advertiesment
YCP MLA Roja fires on Telugu Desam Party
, శనివారం, 24 డిశెంబరు 2016 (14:34 IST)
టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీయా? లేక దొంగల పార్టీయా? దుర్యోధనుల పార్టీయా? అంటూ ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోజా మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని.. అయితే టీడీపీ ఎందుకు పట్టించుకోవట్లేదని అడిగారు. 
 
టీడీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మ‌హిళ‌ల కోసం ఒక్క‌ కార్యక్రమం కూడా చేపట్టడం లేద‌ని ఆమె అన్నారు. ఏపీలో సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రులు ఆడ‌వాళ్ల మాన, ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారని రోజా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు నాయుడు త‌మ పార్టీకి 175 సీట్లు వస్తాయని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆమె ఎద్దేవా చేశారు.
 
గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ మీడియా ముందు ఎంతో ఆవేద‌న వ్య‌క్తం చేసింద‌ని, రాష్ట్ర‌ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని చెప్పినా సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదనే అంశాన్ని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్తూరులో మేయర్ మృతి చెందినా, రామలక్ష్మిని ప‌లువురు వేధించినా వారు మౌనంగానే ఉన్నార‌ని రోజా అన్నారు. ఇప్పుడు జానీమూన్ లాంటి మహిళల బాధ‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్రతో 15 మంది విద్యార్థుల్ని చితకబాదాడు.. శ్రీ చైతన్య లెక్చరర్‌పై కేసు...