Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్రతో 15 మంది విద్యార్థుల్ని చితకబాదాడు.. శ్రీ చైతన్య లెక్చరర్‌పై కేసు...

శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ దొరబాబు అమానుష చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మార్కుల్లో వెనుకబడిన 15మంది విద్యార్థులపై గురువారం కర్రతో చితకబాదిన దొరబాబుపై కేసు నమోదైంది. వివర

Advertiesment
Case registered against Sri Chaitanya lecturer
, శనివారం, 24 డిశెంబరు 2016 (14:28 IST)
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ దొరబాబు అమానుష చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మార్కుల్లో వెనుకబడిన 15మంది విద్యార్థులపై గురువారం కర్రతో చితకబాదిన దొరబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో మార్కులు తగ్గాయని 15 మంది విద్యార్థులపై కర్రతో దొరబాబు తీవ్రంగా దాడి చేశాడు. 
 
ఇతడి దారుణమైన శిక్ష కారణంగా పలువురు గాయపడ్డారు. లెక్చరర్ రాక్షసత్వాన్ని విద్యార్థుల్లో ఒకరు వీడియో తీయడంతో దీనిపై బాలల హక్కుల సంఘం ప్రతినిధి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యుడు అచ్యుతరావు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందకపోయినప్పటికీ స్వచ్ఛంధ సంస్థ ఇచ్చిన వీడియో ఆధారంగా లెక్కరర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాడీఎంకేకు దిక్కులేని పరిస్థితి.. పార్టీ పగ్గాలు ఎవరికి..? శశికళ మౌనానికి కారణం ఏమిటి?