Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీది దోపిడీ ప్రభుత్వం... అఖిలపక్షం మూకుమ్మడి ఆగ్రహం

Advertiesment
వైసీపీది దోపిడీ ప్రభుత్వం... అఖిలపక్షం మూకుమ్మడి ఆగ్రహం
, శుక్రవారం, 26 జూన్ 2020 (20:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు ప్రయోజనాల సాధన కోసం కలసికట్టుగా ఉమ్మడిగా ముందుకు  సాగుతాం అని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సమావేశంలో రాజకీయ పార్టీ నేతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చట్ట సభలు చర్చించకుండా ఆమోదింపబడిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  రావిపాటి సాయికృష్ణ అధ్యక్షతన గుంటూరు సిపిఐ పార్టీ కార్యాలయంలో బడ్జెట్ పైన చర్చ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు, సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ పి ఎస్ సి కమిటీ మెంబర్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల  అజయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాటల గారడీ అంకెల గారడీ ఎక్కువని, వాస్తవ ప్రజా ప్రయోజనాలు తక్కువ అని రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు సెంటు స్థలంలో ఆహ్లాదకరమైన సౌకర్యవంతమైన ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పటం ఏ విధంగా అన్నారు.

ఈ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం కేవలం 200 కోట్లు మాత్రమే పెట్టారని 20 లక్షల అగ్రిగోల్డ్ కుటుంబాలను చీటింగ్ చేశారని, ఈ బడ్జెట్ వంచనతో కూడిన అభివృద్ధి పైన బడ్జెట్ అని ఇందులో నిరుద్యోగభృతి ప్రస్తావన గాని క్యాంటీన్ ఉచిత భోజన ప్రస్తావన గాని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే పెళ్లిళ్ల కోసం లక్షకి ఒక రూపాయి ప్రస్తావనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కోవిడ్ వంకతో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ముగించడం బావ ఇంకా లేదని సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ఒక రోడ్డు వేయలేదు ఒక  ప్రాజెక్టు కట్టలేదని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్లో ఎటువంటి  అదనపు కేటాయింపులు కనపడలేదన్నారు.

గత ప్రభుత్వం మాదిరిగా వివిధ కార్పొరేషన్ల ద్వారా అందరికీ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్  స్కీమ్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని, సంవత్సర కాలంగా కనీసం ఒక్కరంటే ఒక్కరికి అయినా కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించే చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.

ఆఖరికి ఎస్సీ ఎస్టీ  సబ్ప్లాన్ ద్వారా వచ్చే నిధులు వినియోగంలో విఫలమయ్యారని గత ప్రభుత్వంలో 24 వేల కోట్ల సబ్ప్లాన్ నిధులు మౌలిక వసతుల కోసం ఖర్చు చేశామని, దళిత హరిజనవాడలో రోడ్లు డ్రైన్లు నిర్మాణం కోసం కృషి చేశామని సంవత్సర కాలంగా ఎన్ని నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ తప్పులతడకగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అసలు లేదన్నారు.
 
 ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ  సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో అన్ని విధాల వైఫల్యాలతో ప్రభుత్వం నడుపుతున్న ఘనత జగన్ మోహన్ రెడ్డిని అవినీతిని ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా ఎదురు దాడులు కేసులతో  రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు గ్రామ వాలంటీర్ ల పేరుతో మార్చి ప్రజాధనాన్ని మంచి పెడుతున్నారని, ఈరోజు కోర్టు  తీర్పును ధిక్కరిస్తూ కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న అమరావతి రాజధాని అంశం అలాగే వివిధ అంశాలు విషయంలో మూర్ఖత్వంగా గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధానులు ముందుకెళ్తాం అని అని చెప్పించడం ఏమాత్రం సబబు కాదన్నారు.

2019- 20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సాధించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ విధంగా సాధించారో చెప్పాలని కేంద్రమే 12% వృద్ధిరేటు అని చెబుతుంటే ఈ రోజు రాష్ట్రంలోని సగటు ప్రజానీకం అనేక  అవస్థలు పడుతుంటే 8.16% వృద్ధి రేటు సాధించామని చెప్పటం  ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మాటలు మారుస్తూ మడమ  తిప్పుతూ అంకెల గారడీతో బడ్జెట్ ప్రసంగాల ద్వారా మోసాలు చేస్తూ  ప్రజలను మభ్య పెడుతున్నారని, 2019 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థిక మంత్రి 6 తరాలు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించి ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం ప్రత్యేక హోదా అనే పదము ఎత్తకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని అన్నారు. 

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి వెళ్ళిపోయింది అని పదేపదే బురద జల్లుతున్న వైకాపా నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని 2019 బడ్జెట్ స్పీచ్ లో సాక్షాత్తు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో 2014లో లక్ష 3 వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు అప్పు ఉందని, 2019 నాటికి రెండు లక్షల 53 వేల 928 కోట్ల రూపాయలకు చేరుకోవడం జరిగిందని అన్నారని, తేడా చూస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు లక్షా 28 వేల కోట్లు  అని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు  మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం  బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది పోయి రాష్ట్ర ప్రజలను నయవంచన గురి చేసే విధంగా 2019 20 ఆర్థిక సంవత్సరానికి కనీస చర్చ జరపకుండా  ఆమోదించటం అలాగే కోర్టు పరిధిలో  నడుస్తున్న అంశాల గురించి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగటం వంటి ప్రజావ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రజల అందరికీ తెలిసే విధంగా రాజకీయ పార్టీ నాయకులతో కలిసి బడ్జెట్ పై చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేతలు పోదాం భుజంగరావు, లింగం శెట్టి నరేంద్ర బండ్ల శ్రీనివాసరావు, వేగుంట రాణి జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు గాలి వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి  బీ వెంకటేశ్వర్ రెడ్డి, అమరావతి యువజన జెఎసి నాయకులు గేరా నవీన్ కుమార్, అభినయ్ నాగేశ్వరరావు, దాసు  మన్నెం శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం: వైసీపీపై ప‌వ‌న్‌ ఆగ్రహం