Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గతంలో ఏ ప్రభుత్వం మహిళలకు ఇలా చేయలేదు...

Advertiesment
గతంలో ఏ ప్రభుత్వం మహిళలకు ఇలా చేయలేదు...
విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:47 IST)
మహిళా సాధికారత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫాలితాలు ఇస్తున్నాయ‌ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మహిళలకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేద‌న్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం మహిళలకు ఇలా చేయలేద‌ని, ఇపుడు మహిళలే అత్యధిక పథకాలు అందుకుంటున్నార‌ని, క్షేత్ర స్థాయిలో ఎక్కడా అడిగినా ఇదే అభిప్రాయం నెలకొంద‌న్నారు.
 
కుటుంబంలో మహిళలు ఇప్పుడు కీలకం అయ్యార‌ని, సమాజంలో మహిళల ను సమానంగా  చూసే పరిస్థితి రావాల‌ని ప‌ద్మ చెప్పారు. పరిస్థితులు మారాలి... బాధ్యతగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని సూచించారు. దిశ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల‌ని, రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల‌ని అన్నారు.
 
దిశ చట్టాన్ని కాల్చేయాలి అని ఆలోచించిన నారా లోకేష్, చట్టాన్ని హేళన చేశార‌ని, దిశ చట్టం పేపర్లు లోకేష్ కాల్చేసిన సమయంలో చాలా బాధ అనిపించింద‌న్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఏ ప్రభుత్వాలు ఇవ్వలేద‌ని, గత ప్రభుత్వాలు మహిళా అధికారిపై బహిరంగంగా దాడి చేసినా చర్యలు లేవ‌న్నారు. మహిళా సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంద‌ని ప‌ద్మ వివ‌రించారు. 
 
స్పందన ద్వారా మహిళలు వారి సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తున్నార‌ని, అయితే, సోష‌యల్ మీడియా పట్ల యువత అప్రమత్తంగా ఉండాల‌ని చెప్పారు. ఫెస్ బుక్, ఇంస్టాగ్రామ్, స్మార్ట్ ఫోన్ల వినియోగ సమయంలో జాగ్రత్తగా ఉండాల‌ని, వీటిపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలలో అవగాహన కల్పిస్తామ‌న్నారు. ఆపద సమయంలో దిశ యాప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రాలు దాటి ఢిల్లీలో దిశ యాప్ ద్వారా జిల్లాకి చెందిన మహిళను సురక్షితంగా కాపాడటం జరిగింద‌ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత దేశ చరిత్రలో ఇదొక రికార్డ్ అంటున్న స‌జ్జ‌ల‌