చేతులు శుభ్రం చేసుకోని పాపానికి... ప్రాణాలు కోల్పోయింది..
ఇదేంటి..? చేతులు శుభ్రం చేసుకోకపోతే.. ప్రాణాలు కోల్పోతారా అని అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచ
ఇదేంటి..? చేతులు శుభ్రం చేసుకోకపోతే.. ప్రాణాలు కోల్పోతారా అని అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్‌నగర్ కాలనీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన చిన్న రామన్న తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో రామన్న భార్య ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది. కానీ చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోలేదు.
పైగా రాత్రిపూట అలాగే భోజనం చేయడంతో అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.