Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు... లైవ్‌లో పొడిచేశాడు....

ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురం

Advertiesment
Two persons
, శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:48 IST)
ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ప్రేమ వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్. అతను రామచంద్రాపురంకు చెందిన జానకిరామిరెడ్డితో తరచూ గొడవ పడుతుండేవారు. అది కూడా ఒకే అమ్మాయిని ఇద్దరూ కలిసి ప్రేమించిన వ్యవహారంలో. 
 
అయితే ఈ గొడవను సెటిల్ చేసుకుందామని చెప్పి జానకిరామిరెడ్డి  వంశీరాయల్‌ను విమానాశ్రయం సమీపంలోని ఒక వెంచర్ వద్దకు రమ్మన్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఒకవైపు స్నేహితులు సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగానే పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో జానకిరామారెడ్డితో దాడి చేసి మెడపై పొడిచిన వంశీ అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
తీవ్రంగా గాయపడిన జానకిరామారెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను మరణించాడు. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ మర్డర్ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటల్‌జీకి నివాళి.. చంద్రబాబు భావోద్వేగం.. జగన్ ఏమన్నారంటే?