Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం.. సుఫారీ ఇచ్చి భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి..?

Advertiesment
crime scene
, శనివారం, 5 ఆగస్టు 2023 (08:31 IST)
వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. మద్యం తాగించి నిద్రపోతున్న సమయంలో దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
అయితే ఆయనది సాధారణ మరణంగా చిత్రీకరించి దొరికిపోయింది. విశాఖ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బర్రి రమేశ్ కుమార్ (40)-శివజ్యోతి అలియాస్ శివానీ భార్యాభర్తలు. ఎంవీపీ కాలనీలో నివసిస్తున్నారు. 
 
శివానీకి ఎదురింటి రామారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా వుంటూ ఒకేసారి రమేశ్ కంటపడ్డారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గొడవలు మరింత ముదరడంతో భర్తను హత్యచేసి అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. దీంతో ఒకటిన్నర లక్ష సుఫారీ ఇచ్చి భర్తను ప్రియుడితో కలిసి  హత్య చేయించింది. 
 
ఆపై తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. విచారణలో జ్యోతి నేరాన్ని అంగీకరించింది. ఆపై ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్-యాపిల్ ఐఫోన్-14 భారీ తగ్గింపు