రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 7నెలల తరువాత తొలిసారి సీఎం సీబీఐ కోర్టుకు వెళుతున్నారని, ఇప్పటివరకు ఏదో ఒక వంకతో 28 వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకున్నారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.
గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాధ్యత గల వ్యక్తిగా ఇకనుంచైనా జగన్మోహన్‌రెడ్డి క్రమంతప్పకుండా కోర్టులకు హాజరవ్వాలని కోరుకుంటున్నట్లు వర్ల చెప్పారు. జగన్ ఏహోదాలో కోర్టుకు హాజరవుతు న్నారో సమాధానం చెప్పాలన్నారు.
జగన్‌పై వేసిన 11 ఛార్జ్‌షీట్లుకూడా ఆయనపై వ్యక్తిగతంగా మోపబడ్డాయని, ఆనాటికి ఆయన ముఖ్యమంత్రి కాలేదన్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకి వెళ్లడంవల్ల, ఆయనవెంట అధికారులు, భద్రతా సిబ్బంది ఉంటారని, అధికారగణంతో కోర్టుకు వెళ్లడాన్ని తాము సమర్థించబో మని వర్ల స్పష్టంచేశారు.
అలానే జగన్ కోర్టుకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుని ఆయనే స్వయంగా భరించాలని, తన వ్యక్తిగతఖాతానుంచే ఆమొత్తం వెచ్చించాలన్నారు. వ్యక్తిగత ంగా తనపై మోపిన కేసులవిచారణకు వెళుతున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఆయనకయ్యే ఖర్చులకు సంబంధించి, ప్రభుత్వఖజానాపై ఒక్కరూపాయి కూడా వేయ డానికి వీల్లేదని రామయ్య తేల్చిచెప్పారు.
అధికారులు ఈవిషయంలో అప్రమత్తంగా వ్యవహరించి, చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. దేశచరిత్రలోముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కోర్టుకి హాజరైన వ్యక్తిగా జగన్ నిలిచిపోయాడన్నారు. జగన్‌పై జరుగుతున్న విచారణ త్వరగా పూర్తయ్యేలా ఆయనకూడా కోర్టులకు సహకరించాలని, న్యాయస్థానా లుకూడా కేసులవిచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలని వర్ల విజ్ఞప్తిచేశారు.
దానివల్ల జగన్ సచ్ఛీలత, నిజాయితీ ఏమిటో స్పష్టమవుతుందని, ఆయనపై ప్రజల్లో ఉన్న అనుమానాలుకూడా తీరిపోతాయన్నారు. ఏహోదాలో, ఎవరిఖర్చులతో ముఖ్యమంత్రి కోర్టుకు వెళుతున్నారనే వివరాలతో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత చీఫ్‌సెక్రటరీ పై ఉందని రామయ్య తెలిపారు.
228 రోజులు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు..?
నెలకు 4శుక్రవారాల వంతున, ఏడాదికి 52శుక్రవారాలు ఆయనకోర్టుకి వెళితే, మిగిలిన తనపదవీకాలమంతా కలిపి దాదాపు 228 శుక్రవారాలపాటు జగన్మోహన్‌రెడ్డి కోర్టుకి హాజరవుతారని వర్ల వివరించారు.
228రోజులు ఆయన ప్రజలకు సేవచేసే అవకాశం ఉండదుకాబట్టి, తనస్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో ముఖ్యమంత్రే చెప్పాలని వర్ల ఎద్దేవాచేశారు. సీనియర్ మంత్త్రైన బొత్సకు అప్పగిస్తారో, తనకు నమ్మకమైన మరోవ్యక్తిని నియమిస్తారో జగన్మోహన్‌రెడ్డే స్పష్టంచేయాలన్నారు.
228రోజులపాటు రాష్ట్రాన్ని గాలికొదిలేస్తే, ప్రజలు ఎంతనష్టపోతారో ప్రభుత్వపెద్దలే అర్థంచేసుకోవాలన్నారు. ప్రతిశుక్రవారం క్రమంతప్పకుండా జగన్ కోర్టుకి హాజరవ్వాలని, ప్రభుత్వఖజానా నుంచి రూపాయికూడా తనవ్యక్తిగత, కోర్టు ఖర్చులకోసం వినియోగించ కూడదని ముఖ్యమంత్రికి వర్ల విజ్ఞప్తిచేశారు.