Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో మహాకూటమి ఓటమికి బాబు కారణం కాదట.. ఎవరు..?

Advertiesment
Mahakootami
, బుధవారం, 12 డిశెంబరు 2018 (18:57 IST)
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు చంద్రబాబును వీరుడు శూరుడు అంటూ ఆకాశానికికెత్తిన మీడియా…. మహాకూటమి ఓటమి పాలైన సందర్భంగా బాబు ఊసేలేకుండా వార్తలు ప్రచురించాయి. ప్రసారం చేస్తున్నాయి.

తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఊపు వచ్చిందని, హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఉన్న ఫాలోయింగ్‌ చూసి రాహుల్‌ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని, కూటమి కింగ్‌ చంద్రబాబే అని రకరకాలుగా కథనాలు ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా ఇప్పుడు ఆ కోణంలో విశ్లేషణలు చేయడానికి ఇష్టపడటం లేదు. అసలు కాంగ్రెస్‌ - టిడిపి కూటమిని జనం ఆమోదించారా లేదా అనే అంశంపైన కూడా చర్చ చేయడం లేదు.
 
మహాకూటమి ఓటమిలో చంద్రబాబు నాయుడి పాత్ర మాత్రమే కాదు… విధానపరమైన అంశమూ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ – కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం. కాంగ్రెస్‌-టిడిపి పొత్తును రెండు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు జీర్ణించుకోలేదు. అందుకే ఓట్ల బదిలీ జరగలేదు. కొందరు ఇతర పార్టీలకు ఓట్లు వేశారు. ఎన్నికల ఫలితాలపై ఇచ్చిన కథనాల్లో ప్రచురించిన కార్టూన్లలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, రాహుల్‌గాంధీని పెద్దగా వేసి… చంద్రబాబు నాయుడిని కనిపించీ కనిపించకుండా వేశారు. మొత్తంగా మహాకూటమి ఓటమిలో బాబుకు ఏ సంబంధమూ లేదన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రసంతి మీడియా ఎలావున్నా… సోషల్‌ మీడియా వదిలిపెట్టదుగా… ఏకిపారేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీర్బల్, తెనాలిలా.. పవన్ ప్రశ్నించేవారిని పక్కనబెట్టుకోవాలి.. పరుచూరి పలుకులు