Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్సు నడుపుతుండగా డ్రైవరుకు గుండెపోటు, ప్రాణం పోతున్నా 40 మందిని రక్షించాడు

Advertiesment
heart stroke

ఐవీఆర్

, బుధవారం, 16 అక్టోబరు 2024 (10:26 IST)
బాపట్ల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. రేపల్లె-చీరాల పల్లె వెలుగు ఆర్టీసి బస్సు నడుపుతున్న డ్రైవరుకి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. బాపట్లకి సమీపంలో వుండే కర్లపాలెం వద్దకు బస్సు వచ్చేసరికి డ్రైవరు సాంబశివరావుకి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.
 
తను అస్వస్థతకు గురవుతున్నానని తెలిసిన డ్రైవరు బస్సు వేగాన్ని తగ్గించి ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అతడు విగతజీవిగా మారాడు. బస్సు వేగాన్ని తగ్గించడంతో అది పక్కనే వున్న పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే వెళుతున్న సైక్లిస్టుకి బస్సు ఢీకొని అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేబినేట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ.. ఉచిత సిలిండర్ల పథకం గురించి..?