Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heart attack: గర్బా కింగ్ అశోక్ మాలి నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతి (video)

Advertiesment
Garba King Ashok Mali Dies Of Severe Heart Attack

ఐవీఆర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (12:36 IST)
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. పూణేకి చెందిన 'గర్బా కింగ్'గా ప్రసిద్ధి చెందిన నటుడు అశోక్ మాలి చకన్‌లోని ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
మాలి తన కొడుకుతో కలిసి గర్బా ప్రదర్శిస్తుండగా ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు.
 
ధూలే జిల్లాలోని షింద్‌ఖేడా తాలూకాలోని హోల్ గ్రామానికి చెందిన మాలి, 'గర్బా కింగ్'గా ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రదర్శనను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తుంటారు. గత నాలుగైదేళ్లుగా గార్బా ట్రైనర్‌గా పనిచేస్తున్న ఆయన చకన్‌లోని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు అతన్ని ఆహ్వానించారు. అతని కుమారుడు భవేష్‌తో కలిసి ప్రదర్శన సమయంలో విషాదకరంగా ఆయన చనిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్ల ఏనుగులా మారిన రుషికొండ వ్యవహారం