Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ కోల్పోయిన చోట పవన్ వెతుక్కుంటున్నాడా.. ఎవరికి లాభం?

వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తన కోట బద్దలు కావడం చూసి విలపించి ఉండేవాడా? కడప కంచుకోట వైఎస్ జగన్ చేజారిన క్షణం.. వైకాపా గుండె చెదిరింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో కడప స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ తొలిసారిగా ఓటమి పొందింది. ఎన్ని ఓట్ల మెజారిట

Advertiesment
జగన్ కోల్పోయిన చోట పవన్ వెతుక్కుంటున్నాడా.. ఎవరికి లాభం?
హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (08:04 IST)
వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తన కోట బద్దలు కావడం చూసి విలపించి ఉండేవాడా? కడప కంచుకోట వైఎస్ జగన్ చేజారిన క్షణం.. వైకాపా గుండె చెదిరింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో కడప స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ  తొలిసారిగా ఓటమి పొందింది. ఎన్ని ఓట్ల మెజారిటీ అన్నది సమస్య కాదు. కడప గుండెకాయ టీడీపీ పరమైందే అన్న బాధ అటు జగన్‌ని, ఇటు పార్టీ కార్యకర్తలను కంపింప జేస్తోంది.
 
వైఎస్ఆర్ సోదరుడు వివేకానందరెడ్డిపై తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి అనూహ్యం విజయం సాధించడం వైకాపా న్థయిర్యాన్ని బాగా దెబ్బతీసింది. ఎందుకంటే రాయలసీమలో ఆ పార్టీ ఆధిపత్యం తొలిసారిగా సవాలుకు గురైంది. కడపలోనూ వైకాపా బలహీనపడిందనటానికి ఇది సంకేతం. దీని తక్షణ ఫలితం పార్టీనుంచి చాలామంది ఫిరాయించవచ్చు. ప్రజల దృష్టిలో కూడా వైకాపా పలచన కావచ్చు.
 
కడప ఓటమి దీర్ఘకాలిక ఫలితం ఏదంటే బలహీనపడిన వైకాపా ఇక టీడీపీకి ప్రత్యామ్నాయం కాదని ప్రజల్లో అభిప్రాయం బలపడటమే. ఉపాధ్యాయ, ఫట్రభద్ర ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అయి ఉంటే ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఉనికే దెబ్బతినేది. కానీ ఈ ఎన్నికల్లో వైకాపా ముందంజలో ఉండటం ఆ పార్టీకి కాస్త ఊపిరి పోస్తోంది... 
 
అయితే ఇకపై వైకాపా ఎదుర్కొనే ప్రతి పరాజయం జనసేన పార్టీకి బంపర్ బోనస్‌గా నిలుస్తుందని పరిశీలకుల భావన. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి డబుల్ బోనస్ అవుతుంది. ఇలాంటి స్థితిలో తప్పు ఎక్కడ జరిగిందో జగన్ తన పార్టీ నేతలతో కూలంకషంగా చర్చలు జరిపి నష్టనివారణకు దిగకపోతే 2019 ఎన్నికల్లో పార్టీ గల్లంతు ఖాయమని పరిశీలకుల అంచనా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాదాపు 70 ఏళ్లు విచారించి... రాజీయే మార్గమంటారా.. ఇదేం న్యాయం?