Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాదాపు 70 ఏళ్లు విచారించి... రాజీయే మార్గమంటారా.. ఇదేం న్యాయం?

భారత్‌లో రావణకాష్టంలా దశాబ్దాలపాటు మండుతున్న సమస్యల్లో రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం ఒకటి. స్వాతంత్ర్యపు తొలినాళ్లలో మొదలై గత ఏడు దశాబ్దాలుగా కొలిక్కి రాని ఈ సమస్య విషయంలో సుప్రీంకోర్టే చివరికి చేతులెత్తేసింది.

Advertiesment
దాదాపు 70 ఏళ్లు విచారించి... రాజీయే మార్గమంటారా.. ఇదేం న్యాయం?
హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (06:32 IST)
భారత్‌లో రావణకాష్టంలా దశాబ్దాలపాటు మండుతున్న సమస్యల్లో రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం ఒకటి. స్వాతంత్ర్యపు తొలినాళ్లలో మొదలై గత ఏడు దశాబ్దాలుగా కొలిక్కి రాని ఈ సమస్య విషయంలో సుప్రీంకోర్టే చివరికి చేతులెత్తేసింది. కోర్టులో తేలే వ్యవహారం కాదని అటు మతమూ, ఇటు భావోద్వేగాలు పెనవేసుకుపోయి ఉన్నందున ఈ సమస్యను చర్చల ద్వారా మీరే పరిష్కరించుకోండి అని తేల్చి చెప్పేసింది. పైగా ఈ విషయంలో ఇరువర్గాలు కోరితే మధ్యవర్తిత్వం వహిస్తానని వకాల్తా పుచ్చుకుంది కూడా. 
 
తంపులమారి సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో కూడా దూరటం విశేషం. నిజానికి సుబ్రహణ్య స్వామి ఈ కేసును త్వరగా విచారించాలంటూ ఒత్తిడి పెట్టడంతో ఇక మావల్లకాదని సుప్రీంకోర్టు చెప్పేసింది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఖేహర్ చావుకబురు చల్లగా చెప్పేశారు. మత భావోద్వేగాలతో ముడిపడిన ఈ సమస్యకు  ముగింపు పలికేందుకు అన్ని వర్గాలు కలిసి కూర్చుని అంగీకారానికి రావచ్చు, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపవచ్చు’ అని చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం సలహాలిచ్చింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది.
 
అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది. ఆ మేరకు రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంలో అంగీకారం కుదిరేలా తాజాగా ప్రయత్నించాలని పిటిషనర్‌కు సూచించింది. 
 
కానీ సుప్రీంకోర్టు సలహాను కక్షిదారులు పాటిస్తారా అనేదే సందేహం. అలా పాటించి ఉంటే, ఇచ్చి పుచ్చుకునే దోరణి ఈ సమస్య పరిష్కారంలో అవసరం అని ఇరుపక్షాలూ గుర్తించి ఉంటే ఆలయ-మందిర సమస్య ఇన్నాళ్లూ రావణకాష్టంలా మండేదా...సుప్రీంకోర్టు సూచననైనా గౌరవించి అంతిమ పరిష్కారానికి సన్నద్ధం కావడం ఈ దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలా చూపించి వెళ్లాలని నాకు తెలీదే.. జగన్ దెప్పుతో ఖంగు తిన్న రామకృష్ణుడు