Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి రాజధాని అనడానికి గెజిట్‌ ఏది?.. మంత్రి బొత్స

అమరావతి రాజధాని అనడానికి గెజిట్‌ ఏది?.. మంత్రి బొత్స
, శనివారం, 7 సెప్టెంబరు 2019 (18:08 IST)
అమరావతి రాజధాని అనడానికి గెజిట్‌ ఏది అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రశ్నించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..

"ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేసేవారే నిజమైన నాయకుడు. జగన్‌ 100 రోజుల పాలన చిరస్ధాయిగా నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సిఎం జగన్‌ ది ప్రత్యేకస్ధానం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు చట్టబధ్దత కల్పించారు. ఇచ్చిన మాట నెరవేర్చేందుకు జగన్‌ చిత్తశుద్దితో కృషిచేస్తున్నారు.
 చంద్రబాబు రాక్షసపాలన అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కడుపుమంటను తెలియచేస్తున్నాయి" అని విమర్శించారు.  
 
"టిడిపి పాలనలో మంచిపనులు ఎందుకు చేయలేకపోయారు.  లోకేష్‌ ఇది తుగ్లక్‌ పాలన అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. తుగ్లక్‌ పాలన అంటే చంద్రబాబు పాలనే. తుగ్లక్‌ పాలన అంటే లోకేష్‌ కు అర్ధం తెలుసా? ఉధ్దానంలో పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చినమాటను నిన్న నెరవేర్చారు.

 
100రోజులలోనే 200 పడకల ఆస్పత్రికి శంఖుస్దాపన చేశారు. ఉధ్దానం కిడ్నీబాధితుల గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా? ప్రతి ఇంటికి స్వఛ్చమైననీరు అందించాలనే ప్రయత్నం మంచిదికాదా? హామీల అమలుకు బడ్జెట్‌ లో ఖచ్చితమైన కేటాయింపులు చేశాం.  ప్రతి పధకానికి డెడ్‌ లైన్‌ పెట్టి మరీ జగన్‌ ముందుకు వెళ్తున్నారు.

 
 ఏ వ్యక్తులనైనా ప్రజలను గ్రామాలనుంచి బహిష్కరించారని ఎక్కడైనా వచ్చిందా? గుంటూరులో ఇంటింటికి తీసుకువెళ్లి బాధితులను దిగబెడతారంట. కావాలనే ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లుతున్నారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ లను పెట్టుకుని రాజకీయాలు చేస్తారా? ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసినపుడు జగన్‌ ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉన్నారు. లేఖ ఇస్తూనే ఉన్నారు.
టిడిపి వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మా దారి మారదు. మీ ఊబిలో పడి దారితప్పుతామని అనుకుంటే పొరపాటు.
కోడెల శివప్రసాదరావుని ఈ ప్రభుత్వం హింసిస్తుందా? ఆయన తప్పు చేశాడా లేదా? ఆయన చర్యల వల్ల రాజకీయవ్యవస్దపట్ల ఛీదరించుకునే స్దితి తెచ్చాడా లేదా? చింతమనేని ప్రభాకర్‌ పై కేసులు ఆయన తిడితే పెడుతున్నారా కావాలని పెడుతున్నారా?

శ్రీకాకుళంలో కూనరవి అధికారులను దూషించింది వాస్తవమా కాదా? రాజధాని రాజధాని అని గగ్గోలు పెడుతున్నారు. స్దానిక ఎంఎల్‌ ఏ వెళ్తే ఎంత అహంకారంతో అవమానించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకం చూడటం లేదా? మమ్మల్ని నిందించడమేంటి? ఇది ప్రజాస్వామ్యం, చట్టాలు ఉన్నాయి. అవి వాటి పని అవి చేసుకువెళ్తుంటాయి.

కూన రవి అధికారులను దూషించలేదు.కోడెల ఏమీ చేయలేదు. టాక్స్‌ లు వసూలు చేయలేదు. వాహనాలపై టాక్స్‌ చెల్లించకుండా వ్యాపారం చేయలేదని చెప్పమనండి. ఓడిపోయినా తెలుగుదేశం నేతలకు అహంకారం తగ్గలేదు. ఏమైనా అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు చెబుతుంటారు.

మీరు ఎన్ని విమర్శలు చేసినా మా భగవధ్గీత,ఖురాన్‌ ,బైబిల్‌ మా వద్ద ఉంది. దాని ప్రకారం మేం ముందుకు వెళ్తాం. అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందా? అమరావతి రాజధాని అనడానికి గెజిట్‌ ఏది? నీ పరిపాలన విధానం ఇదేనా? ప్రతిదానిని మేం ఇష్యూ చేయదలుచుకోలేదు. ఆయన లేవనెత్తిన అంశాలనే ప్రస్తావిస్తున్నాం.

నీవు ఏరకంగా తాత్కాలిక నివాసంలో ఉంటున్నావో రాజధానిని కూడా తాత్కాలికంగా చేశావు. ప్రతిదానిని రాధ్దాంతం చేయడం తెలుగుదేశం పనిగా పెట్టుకుంది. ప్రతిపేదవాడి గుండెల్లోను ఈ ప్రభుత్వం మాది అనుకునేలా పరిపాలన చేస్తాం.
 ఇంకా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు తెలియచేస్తున్నాం.

చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఉధ్దరించింది ఏంటి మేం చేయలేనిది ఏంటి? ఆంధ్రప్రదేశ్‌ ను చంద్రబాబు అధోగతి పాలు చేశాడు" అని ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్ న్యూస్.. ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటున్నారా?