Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినోద్‌ రాయల్‌‌కు ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటి...? తిరుపతిలో ఏంటి ఆ హడావుడి...?

ఓ టాప్ హీరో అభిమానుల చేతిలో దారుణ హత్యకు గురైన వినోద్‌ రాయల్‌ హత్యను రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తే ఆ సామాజిన వర్గానికి చెందిన వారు మాత్రమే స్పందిస్తున్నారు. అంతేకాదు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ సామాజిక వ

Advertiesment
వినోద్‌ రాయల్‌‌కు ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటి...? తిరుపతిలో ఏంటి ఆ హడావుడి...?
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (15:32 IST)
ఓ టాప్ హీరో అభిమానుల చేతిలో దారుణ హత్యకు గురైన వినోద్‌ రాయల్‌ హత్యను రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తే ఆ సామాజిన వర్గానికి చెందిన వారు మాత్రమే స్పందిస్తున్నారు. అంతేకాదు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పవన్‌ ఫోటో కింద వినోద్‌ రాయల్‌ ఫోటో పెట్టి పట్టణంలో ప్లెక్సీలను ఏర్పాటు చేసేశారు. వినోద్‌ శుభస్వీకరణ రోజే కొంతమంది ఇలా చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
 
కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో అవయవదాన కార్యక్రమానికి వెళ్ళిన వినోద్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పవనిజం అన్నాడన్న ఆగ్రహంతో హత్యకు పాల్పడినట్లు పవన్‌ అభిమానులే చెబుతున్నారు. ఈ హత్య తరువాత ఒక్కసారిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బయటకు వచ్చారు. తిరుపతికి వచ్చిన పవన్‌ వినోద్‌ కుటుంబాన్ని పరామర్సించారు. అంతేకాదు మీకు అండగా నేనుంటా అంటూ భరోసా కూడా ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా పవన్‌ కళ్యాణ్‌ బయటకు రావడంతో కొంతమంది దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది లబ్థి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
 
తిరుపతిలో ఈరోజు వినోద్‌ రాయల్‌ శుభస్వీకరణ జరుగుతోంది. దీంతో కొంతమంది పనిగట్టుకుని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పవన్‌ ఫోటోను  పెద్దదిగా పెట్టి జనసేన పార్టీ జెండాను కూడా ఫ్లెక్సీలో ఉంచారు. పార్టీ గుర్తు కింద వినోద్‌ రాయల్‌ ఫోటోను పెట్టారు. వినోద్‌ ఇంటి సమీపంలోని ఎయిర్‌ బైపాస్‌రోడ్డులోనే ఇదంతా పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. దీన్ని చూస్తున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వినోద్‌కు ప్రత్యేక హోదాకు ఏం సంబంధం అని ముక్కునవేలేసుకుంటున్నారు. వినోద్‌ హత్యను కూడా రాజకీయం చేయడంపై పలువురు మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో స్పీచ్... రూ. 12,000 కోట్లు నష్టపోయిన ఐడియా, ఎయిర్‌టెల్