Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తాం: అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ

రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తాం: అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ
, సోమవారం, 27 జులై 2020 (09:13 IST)
అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఎన్ని రోజులైన తమ పోరాటాన్ని సాగిస్తామని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి, కో ఆర్డినేటర్ ఆర్.వి.స్వామి తెలిపారు.

రాజధాగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతుల పోరాటం నేటికీ 222 రోజులు పూర్తి అయిన సందర్భంగా జెఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ, ఆటోనగర్‌లోని రాష్ట్ర అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కార్యాలయంలో ఆదివారం జెఏసీ నాయకులు, రాజధాని మహిళా రైతులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా "జై అమరావతి.. జైజై అమరావతి”, “భూములు ఇచ్చాం - రోడ్డున పడ్డాం”, “న్యాయం అడిగితే కేసులు పెడతారా” “గవర్నర్ న్యాయం న్యాయాన్ని ధర్మాన్ని రాజ్యాంగాన్ని రాష్ట్రాని” కాపాడాలని పెద్దపెట్టున నినాధాలు చేశారు.

జెఏసీ కన్వీనర్ ఎ. శివారెడ్డి, కో-కన్వీర్ ఆర్.వి స్వామి మాట్లాడుతూ రాజధానికోసం మరో 222 రోజులైన తమ నిరసనను కొనసాగిస్తామని, ఆనాడు అమరావతికి జగన్ మోహన్ రెడ్డి అనుకూలమని చెప్పి.. నేడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి రైతులను ప్రజలను మోసం చేశారన్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని కోరారు.

అమరావతి రాజధానిగా శంకుస్థానక చేసిన ప్రధాని మోడి జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 13 జిల్లాలోని గ్రామాలు, పట్టణాలలో దీక్ష నిర్వహించి జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

రాజధాని మహిళా రైతులు బి. ప్రియాంక, సి.హెచ్. అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కి రోధిస్తున్నా.. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం చాలా బాధకరం అన్నారు.

రైతుల త్యాగాలను గుర్తించాలని ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలని గవర్నర్ ను కోరారు. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జి.బుచ్చి తిరుపతి రావు, బి.సాంబశివరావు, కె.నాగభూషణం, రాజధాని మహిళా రైతులు ఎ.సునీత, జె.కృష్ణ కుమారి, వి. రాధ, ఎ.రాగలత, జె.తారావాణి, కె.వాణి, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్-19 వైరస్ మీ ఇంటి దరిచేరకుండా చేయడం ఎలా?