Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పత్రికలను తిడితేనో, నన్ను తిడితేనో భయపడం: దేవినేని ఉమా

పత్రికలను తిడితేనో, నన్ను తిడితేనో భయపడం: దేవినేని ఉమా
, బుధవారం, 30 డిశెంబరు 2020 (19:28 IST)
కృష్ణా జిల్లా పురగుట్టలో టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టాలు పొందిన పేదల ఉసురు ప్రభుత్వంకు తగులుతుందని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు సిగ్గు శరం లేకుండా వైసీపీ పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడమే పురగుట్ట పేరు మార్చి ఎన్ టీ ఆర్ పేరు పెట్టి పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్యే వసంత అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్నాడన్నారు.

‘‘పత్రికలను తిడితేనో, నన్ను తిడితే నో నీకు భయపడం’’ అని ఉమా తెలిపారు. రైతు సమస్య తీర్చమని వస్తే నాయకుడితో దాడి చేయించడం దారుణమన్నారు. రైతు లపై దాడులు చేయడమేనా రాజన్న రాజ్యం అని నిలదీశారు.

వైసీపీ నాయకుల దాడులకు కొంతమంది గ్రామాలు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. అవినీతి చేస్తే రాజీనామా చేస్తానన్నావుగా చెయ్ అని దేవినేని సవాల్ విసిరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టోల్‌ప్లాజాల్లో ఒకటి నుంచి నగదు కౌంటర్లు బంద్‌