Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోకేశ్, చంద్రబాబునాయుడిపై దుష్ప్రచారం చేసే సోషల్ మీడియా సంస్థలను వదిలిపెట్టం

Advertiesment
లోకేశ్, చంద్రబాబునాయుడిపై దుష్ప్రచారం చేసే సోషల్ మీడియా సంస్థలను వదిలిపెట్టం
, మంగళవారం, 23 మార్చి 2021 (21:56 IST)
లోకేశ్‌కు ఎటువంటి అర్హతలు లేకపోయినా అమెరికా లోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం సీటిచ్చిందని, ఆ సీటు పొందడానికి కావాల్సిన సొమ్ముని ఎవరో కట్టారని, డొనేషన్ కట్టి, లోకేశ్ సీటు సంపాదించాడని ఓ వెబ్ పత్రికలో అసత్యాలు, తప్పుడు కథనాలు వండి వార్చారని, దానిపై లోకేశ్ తరుపున, బండారు వంశీకృష్ణపేరుతో డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు.
 
మంగళవారం ఆయన టీడీపీ నేతలు సయ్యద్ రఫీ, బండారు వంశీకృష్ణలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. లోకేశ్ గారి చదువుకు అవసరమైన డబ్బుని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి ఏ రోజు ఎంతెంత పంపామనే రసీదులు తమదగ్గరున్నాయని, వాటిని కూడా డీజీపీకి సమర్పించామని బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు. లోకేశ్ గారి తల్లిగారైన భువనేశ్వరి గారి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బు పంపడం జరిగింద న్నారు. అదేవిధంగా లోకేశ్ గారు చదువుకునే సమ యంలో కాలేజీకి ఒక లెటర్ కూడా రాయడం జరిగింద న్నారు. ఈవిధంగా వాస్తవాలన్నీ కళ్లముందు కనిపిస్తుంటే కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్లు, వెబ్ పత్రికలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని రామ్ ప్రసాద్ ఆగ్రహంవ్యక్తంచేశారు.
 
ఆయా సామాజిక మాథ్యమాలన్నీ పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. అటువంటి కథనాలతో లోకేశ్ గారి ఇమేజ్‌ను దెబ్బతీయలేరన్న ప్రసాద్, అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపడం ఎంతకష్టమో, లోకేశ్ పరువు, ప్రతిష్టలను, చరిష్మాను దెబ్బకొట్టాలనుకోవడం కూడా అంతే కష్టమన్నారు. తప్పుడు కథనాలు ప్రచారం చేసే వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సవాంగ్‌ను కోరామని, ఆయన నుంచి స్పందన లేకుంటే తామే న్యాయపరంగా సదరు వెబ్ సైట్లపై చర్యలు తీసు కుంటామని బుచ్చిరామ్ ప్రసాద్ హెచ్చరించారు.
 
వైసీపీ నేతలైనా, మరెవరైనా సరే, మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు. లోకేశ్ గారి  తరుపున బండారు వంశీకృష్ణ నేడు డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. లోకేశ్‌కు అర్హత లేకపోయినా అమెరికాలో సీటు ఇచ్చారని, దానికి ఎవరో డబ్బు చెల్లించారని ఒక వెబ్ పత్రిక కథనాలు ప్రసారం చేసిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామ్ ప్రసాద్ తెలిపారు. అమెరికాలో చదడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని, అనేక పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసేవారికి ఆధారాలు, వాస్తవాలతో పని లేదని, వారు ఏదనుకుంటే అదే పదిసార్లు చెబుతుంటారన్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో లోకేశ్ విద్యాభ్యాసం సహా, అన్నింటికీ తమవద్ద ఆధారాలున్నాయని, తమ నాయకుడైన లోకేశ్ పైన బురద జల్లేవారు ఎటువంటి ఆధారాలతో మాట్లాడుతున్నారో చెప్పాలని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
 
 
చంద్రబాబునాయుడిపై ఆళ్ల రామకృష్ణారెడ్డిపెట్టిన కేసు వైసీపీకి బూమ్ రాంగ్ కావడంతో, ఇప్పుడు లోకేశ్ పై దుష్ప్రచారానికి తెగబడ్డారని సయ్యద్ రఫీ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ పేరు వింటే నిద్ర పట్టడం లేదని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసు, అధికార పార్టీకి బూమ్ రాంగ్ కావడంతో వారు ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డారని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు చంద్రబాబునాయుడిపై ఇచ్చినఫిర్యాదుకు సంబంధించి తమకు కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా వస్తారా అని వైసీపీ తాడేపల్లి కార్యాలయంవారు భూతద్దం వేసిమరీ వెతుకుతున్నారన్నారు.
 
చంద్రబాబుపై చేయాలనుకున్న దుష్ప్రచారం బెడిసికొట్టడంతో, ఇప్పుడు లోకేశ్ గారిపై వారి కన్నుపడిందని రఫీ చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదేవిధంగా దుష్ప్రచారం చేశారని, కానీ ఆనాడు తాము ప్రజల గురించి ఆలోచించి, పెద్దగా పట్టించుకోలేదన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు డీజీపీ చర్యలు తీసుకోకుంటే, 2, 3 రోజుల్లోనే హైకోర్టులో పిటిషన్ వేస్తామని రఫీ స్పష్టంచేశారు.

చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలని తమ పార్టీ నిర్ణయించుకుందన్నారు. చేతిలో ఫేస్ బుక్, వెబ్ సైట్, ట్విట్టర్ ఉన్నాయి కదా అని పేట్రేగిపోతున్నవారికి, ఇక నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని రఫీ తేల్చిచెప్పారు. తమపై, తమ పార్టీపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, దుష్ప్ర చారాలకు తెరదించి, వాటిని ప్రచారం చేసేవారికి జీవితంలో ఇంకెప్పుడూ, ఎలాంటి రాతలు రాయకుండా తగినవిధంగా బుద్ధిచెబుతామని రఫీ హెచ్చరించారు. తప్పడు రాతలు రాసేవారంతా ఇకనుంచైనా ఒళ్లుదగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే వారికే మంచిదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌కు బదులు క్యాప్సుల్స్ వచ్చేశాయ్!