టీడీపీ అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయ్ తెలుసా?

గురువారం, 23 మే 2019 (18:22 IST)
ఏపీలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయింది. టీడీపీకి చెందిన ప్రముఖులు కూడా ఓటమి చవిచూడబోతున్నారు. మరోవైపు విశాఖ జిల్లా అరుకు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. గతేడాది మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి చంద్రబాబు అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. 
 
తర్వాత ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి శ్రవణ్ కుమార్‌ను నిలబెట్టారు. అయితే అరుకులో తండ్రి సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదు. ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయింది. నోటాకు వచ్చిన ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థికి రాలేదు. తాజా మాజీ మంత్రిగా పని చేసిన శ్రవణ్ కుమార్ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం AP Assembly 2019 Live results - YSRCP -102 / TDP-16, వైసీపీ 48 విజయం