భక్తులు చింతించకండి, రాములోరి కళ్యాణాన్ని మీరూ చూడొచ్చు, ఎలా?

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (19:23 IST)
కరోనా దెబ్బతో టిటిడి ముఖ్య ఆలయాన్ని ఇప్పటికే భక్తుల అనుమతిని రద్దు చేసింది. అయితే కొన్ని ఆలయాలను మాత్రమే తెరిచి ఉంచి ఏకాంతంగా సేవలను కొనసాగిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలోను ఏకాంతంగా కైంకర్యాలు జరుగుతున్నాయి. 
 
అయితే ఒంటిమిట్ట ఆలయంలో ప్రతియేటా రాములవారి కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. వేలాదిమంది ప్రజలు కళ్యాణోత్సవాన్ని నేరుగా తిలకిస్తారు. కళ్యాణోత్సవం రోజు అధికసంఖ్యలో భక్తులు ఒంటిమిట్టలో కిక్కిరిసి కనిపిస్తారు. 
 
అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో భక్తులెవరినీ దర్సనానికి అనుమతించడం లేదు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కూడా భక్తులకు నో ఎంట్రీ అంటూ బోర్డులు పెట్టారు. కానీ రేపు జరిగే రామయ్య కళ్యాణోత్సవాన్ని టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో తిలకించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రేపు రాత్రి గంటల నుంచి 9 గంటల వరకు ఏకాంతంగా కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.
 
భక్తులందరూ ఇళ్ళ నుంచే భక్తిఛానల్ లో స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది టిటిడి. నిరంతరం కళ్యాణోత్సవం ముగిసేంత వరకు భక్తులందరూ స్వామివారిని టివీల్లో వీక్షించవచ్చని టిటిడి ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న చెన్నై జనం, కరోనా కేసులు 621