తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో విషాదం నెలకొంది. అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుండి గోదావరిలోకి దూకిన వాలెంటీరును రక్షించబోయి కౌన్సిలర్ విజయ్ దుర్మరణం పాలయ్యాడు.
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ పైనుండి మురమళ్ళ గోదావరి లోకి వలంటీర్ దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆమెను కాపాడేందుకు ముమ్మిడివరం నగరపంచాయితీ 12 వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయ్ నీళ్ళలోకి దూకాడు.
మహిళా వాలంటర్ ఎలాగోలా బయపడింది. ఆమెని కాపాడేందుకు గోదావరి లోకి దూకిన కౌన్సిలర్ నీళ్ళలో మునిగిపోయాడు. ఇద్దరు స్థానికులు ఒడ్డుకు తీసుకు వచ్చే లోపు కౌన్సిలర్ విజయ్ మృతి చెందాడు. వాలంటీర్ పెదపూడి లక్ష్మి కుమారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.