Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

Advertiesment
hot water

ఠాగూర్

, గురువారం, 31 జులై 2025 (16:33 IST)
విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నం పరిధిలోని నేరెళ్ళవలసలో ఓ దారుణం జరిగింది. నిద్రిస్తున్న భర్తపై ఓ భార్య వేడినీళ్లు పోసింది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాలను పరిశీలిస్తే, నందిక కృష్ణ, గౌతమి అనే దంపతులు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త పడక గదిలోకి వెళ్లి పడుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని భార్య... భర్తపై వేడినీళ్లు పోసింది. బాధితుడుకి గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు 
 
ఎస్టీ ఎస్టీ విభాగాలకు చెందిన నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీచేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జస్టిస్ భట్టి, జస్టిస్ అమానుతుల్లాలతో కూడిన ధర్మాసనం సుధీర్ఘంగా వాదనలు ఆలకించిన తర్వాత గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే, ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్టుగా ఉందని మండిపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు