Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు.. జీవీఎంసీ ప్రకటన

Advertiesment
vizag
, మంగళవారం, 14 మార్చి 2023 (20:20 IST)
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2023 మార్చి 28, 29 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలన- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రకటించింది. 
 
G20 సమ్మిట్‌లో భాగమైన 2వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశంలో థీమ్‌ను నిర్దేశించారు. జీ20 సదస్సులో నగర పౌరులు పాల్గొనేందుకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ తెలిపింది. 
 
ఈ ఈవెంట్‌లో సిటీ యోగా డ్రైవ్, వైజాగ్ సిటీ మారథాన్, మార్చి 19న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర కళ, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు వున్నట్లు జీవీఎంసీ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Realme C55 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు.. భారత్‌లో ఎప్పుడో..?