మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు పోలీసులకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది.
శుక్రవారం రాత్రి పులివెందుల పోలీసులు గంగిరెడ్డిని హైద్రాబాద్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ పరీక్షలకు కోర్టు అనుమతిని ఇచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగయ్య, ఈ కేసులో అనుమానితుడు శేఖర్ రెడ్డిలకు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి కూడ నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో నార్కో టెస్ట్‌కు అనుమతి ఇచ్చిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకొంది.