Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ రైల్వే స్టేషన్‌కు అరుదైన గుర్తింపు ... భారతీయ రైల్వేలోనే తొలి రోబో కాప్

Advertiesment
asp arjun robocop
విశాఖ రైల్వే స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారి రోబో కాప్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తూర్పు కోస్తా జోన్ వాల్తేరు డివిజన్‌ పరిధిలోకి ఈ రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ రోప్ కాప్‌ను ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) అలోక్ బొహ్రా, డీఆర్ఎం లలితో బొహ్రా చేతుల మీదుగా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ, ప్రయాణికులకు సాయం చేయడం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, భద్రతాపరమైన అంశాలపై పర్యవేక్షణకు ఈ రోబో సేవలను రైల్వే పోలీసులు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అధునాతన కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ (ఐవోటీ) సాంకేతికతతో రైల్వే పోలీసులకు సహాయపడుతుందన్నారు. 
 
స్టేషన్‌లో నిత్యం పహారా కాస్తు అనుమానితులను గుర్తించడం, చొరబాటుదారులను కనుగొనడం వంటివి ఈ రోబో కాప్‌ చేస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారిని, అనుమానితుల చిత్రాలు తీసి విశ్లేషించి గుర్తించడంలో సహాయపడుతుందన్నారు. హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రజలను అప్రమత్తం చేస్తుందన్నారు. ఈ రోబోకు రైల్వే పోలీసులు 'ఏఎస్పీ అర్జున్' అని పేరు పెట్టారు. భవిష్యత్తులో పలు రైల్వే స్టేషన్లలో ఈ తరహా రోబోల సేవలను వినియోగించుకుంటామని వారు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకోసం ఎన్నో చేశాం.. కూర్చొని వినండి... లేదంటే బాగుండదు.. మహిళలపై నితీశ్ చిందులు