Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిజ్రాల వద్ద రూ.లక్షన్నర మోసం చేసిన వాలంటీర్...

thieves
, సోమవారం, 4 సెప్టెంబరు 2023 (14:16 IST)
వెస్ట్ గుంటూరు జిల్లాలో ఒక వాలంటీరు హిజ్రాల లక్షన్నర రూపాయలు తీసుకుని పారిపోయాడు. రూ.2 వేల నోట్లు మార్చి ఇస్తామని నమ్మించి ఈ మోసానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతకాలంగా సదరు వాలంటీరు హిజ్రాలతో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లు ఉంటే తనకివ్వాలని, బ్యాంకులో తనకు తెలిసిన వారు ఉన్నారని, వారు ఎంతైనా మారుస్తారని హిజ్రాలను నమ్మించాడు. 
 
వాలంటీర్ మాటలు నమ్మిన హిజ్రాలు రూ.3 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఇచ్చారు. ఆ నోట్లను మార్చి వారికి రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ నెలాఖరుతో రూ.2 వేల నోట్లు మార్పిడి చేసుకునే గడువు ముగియడంతో మరోసారి రూ.లక్షన్నర విలువైన రూ.2 వేల నోట్లు వలంటీరు అందించారు. దీంతో రూ.లక్షన్నర పెద్ద నోట్లతో సదరు వలంటీర్ హైదరాబాద్ ఉడాయించాడు. 
 
ఈ విషయం తెలుసుకుని కొందరు హిజ్రాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. అతడిపై స్థానిక పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదిచ్చినట్లు హిజ్రాలు తెలిపారు. వాలంటీర్ వ్యవహారం బయటకు పొక్కితే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోనని కొందరు అధికార పార్టీ నాయకులు కావాలనే ఈ ఉదంతాన్ని కప్పిపెడుతున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. పరారీలో ఉన్న వాలంటీర్‌‍ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత హిజ్రాలు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గవర్నర్ పదవి?