జింక మాంసంతో మద్యం పార్టీ...

ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (14:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు జింక మాంసం కూరతో మద్యం పార్టీ చేసుకున్నాడు. ఇందుకోసం ఆ కుర్రోడు జింకను వేటాడి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఆ వేటగాడిని అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం భానపూర్ గ్రామానికి చెందని శేఖర్ అనే యువకుడు ఓ జింకను వేటాడాడు. అనంతరం దాన్ని చంపి పార్టీ చేసుకున్నాడు. ఈ ఘటనపై రహస్య సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శేఖర్ ఇంటిపై దాడిచేశారు.
 
ఈ సందర్భంగా జింక తల, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో శేఖర్‌పై వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమళ్లు, జింకలు వంటి జీవులను వేటాడటంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మరోవైపు శేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కొలంబో పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న నటి రాధిక