Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీన దయాళ్ అంత్యోదయ యోజనతో ఉపాధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Advertiesment
దీన దయాళ్ అంత్యోదయ యోజనతో ఉపాధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (19:12 IST)
విజ‌య‌వాడ‌లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు దీన దయాళ్ అంత్యోదయ యోజన, స్వచ్చ భారత్ మిషన్  కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ పై శిక్షణ కార్యక్రమంను నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ, దీన దయాళ్ అంత్యోదయ యోజన, స్వచ్చ భారత్  సంయుక్త కార్యక్రమం మెప్మా గ్రూప్ సభ్యుల జీవన శైలిని మెరుగుప‌రిచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. జీవనోపాధి మార్గాలు పెరగటమే కాక, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం మెరుగుకు అవకాశం ఉంటుందని అన్నారు.  
                                                                                                                                                                                    
 
బలహీన వర్గాలయిన పారిశుద్ధ్య వృత్తి కి చెందిని వారు, దివ్యంగులు, ట్రాన్స్ జన్డర్,  రిక్షా కార్మికులు, నిర్మాణ రంగంలో పని చేసుకోని వారిని గుర్తించి, వారిని మెప్మా గ్రూప్ గా చేయ‌డ‌మే కాకుండా, వారికి వివిధ   జీవనోపాదులలో శిక్షణ కల్పిస్తున్నామ‌ని చెప్పారు. సిబ్బందిలో అవగాహనా కల్పించ‌డం వ‌ల్ల పారిశుద్ధ్యం మెరుగు పడుతుంద‌ని, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొని రాబోవు రోజులలో విజ‌య‌వాడ‌ నగరం ప్రధమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరం సమష్టిగా కృషి చేయాల‌న్నారు. 
 
                                                                                                                                                        విజ‌య‌వాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్ ఆఫీసర్) యు.శారద దేవి పర్యవేక్షణలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) టి.సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కల్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌లో భారీ పేలుడు - ముగ్గురి మృతి