మునుపెన్నడూ చూడని విపత్కర కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రతరమవుతోన్న నేపధ్యంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో పూటగడవక అల్లాడుతున్న పేదలకు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సేవలందించడం ముదావహమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు నేతృత్వంలో 2500 మంది పేదలకు నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీని ఎమ్మెల్యే విష్ణు శనివారం ఉదయం గాంధీనగర్ చాంబర్ కార్యాలయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం మల్లాది విష్ణు మట్లాడుతూ రెడ్‌జోన్ పరిసర ప్రాంతాల్లో పేదలకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయడం పట్ల అభినందనీయమన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు మరింత మంది సహృదయంతో స్పందించి ముందుకు రావాలని కోరారు.
ఛాంబర్ అధ్యక్షుడు విద్యాధరరావు మాట్లాడుతూ లాక్‌డౌన్ కాలంలో వ్యాపారులకు అండగా నిలవడంతో పాటు సమాజ సేవలోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో చాంబర్ ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఎల్.ఎన్. వరప్రసాద్, కోశాధికారి వక్కలగడ్డ శ్రీకాంత్, ఛాంబర్ సభ్యులు ఈమని దామోదర్, ఆత్మకూరు సుబ్బారావు, కొల్లూరు రామకృష్ణ, ముచ్చర్ల శ్రీనివాస్, బొప్పూడి రామకృష్ణ, దాతలు పాల్గొన్నారు.