విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మరియు బి. సి.ఎ. చివరి సంవత్సరం విద్యార్థులు 16 మంది ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఉపాధి అవకాశం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మూడు దశలలో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్. ఇంటర్వ్యూలలో తమ కళాశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచి రెండున్నర లక్షల వార్షిక వేతనంతో ప్రోగ్రామర్ ట్రైనీలుగా ఉపాధి అవకాశం పొందినట్లు కళాశాల శిక్షణా ఉపాధి విభాగం అధికారి కావూరి శ్రీధర్ వెల్లడించారు.
ఎంపికైన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.