Video of water from wild tree
అడవి చెట్టు కొమ్మ నుండి నీరు ప్రవహిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని పాపికొండలు జాతీయ ఉద్యానవనంలో ఈ వీడియో తీయబడింది. ఇక్కడ కొంతమంది అటవీ అధికారులు నల్ల మద్ది చెట్టు నుంచి నీళ్లు రావడం చూశారు. ఈ చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందిన ఈ చెట్టు భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో కనిపిస్తుంది.
వృక్షశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, చెట్టు తన ట్రంక్‌లో నీటిని నిల్వ చేసే విచిత్రమైన లక్షణాన్ని కలిగి ఉంది.
ఈ నీరు త్రాగడానికి యోగ్యమైనది. ఈ నీటిలో ఔషధ గుణాలు వున్నాయని.. ఈ నీళ్లు కడుపు నొప్పిని నయం చేయడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ వృక్షం చెక్కను వాయిద్యాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.