Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు జాతికే గర్వకారణం వెంకయ్య నాయుడు : డీకే అరుణ

తెలుగు జాతికే గర్వకారణం వెంకయ్య నాయుడు : డీకే అరుణ
, సోమవారం, 19 జులై 2021 (08:49 IST)
తన ఆహార్యం మాట తీరుతో పంచకట్టుతో తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా దేశ రాజకీయాల్లో ప్రభాశీల వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడని బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు.

ఢిల్లీలో డీకే అరుణతో పాటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ బిజేపీ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వెంకయ్యనాయుడిని మొదటిసారిగా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు ఎం వెంకయ్యనాయుడనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాల్లో పని చేసి మెప్పించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు.

దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా.. నేనున్నానంటూ కదిలివచ్చి తనదైన శైలిలో సమస్యను పరిష్కరించే అపర మేధావని, అంతకుమించి తెలుగు జాతికే గర్వకారణమైన నేత అని వారు కొనియాడారు. ఇలాంటి ప్రముఖులు ఇప్పుడు దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన భారత ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టనుండటం తెలుగువారి అదృష్టం అని డీకే అరుణ అన్నారు.

బిజెపి షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నప్పటికీ తమను ఎంతో ఆప్యాయంగా పలకరించడం తన జీవితంలో ఎంతోగొప్ప అనుభూతిగా మిగిలిందన్నారు.

వెంకయ్య నాయుడితో గతంలో అనేక ఎన్నికల ప్రచారంలో ఆయనతో కలిసి ఓ కార్యకర్తగా పని చేసిన  స్వీయానుభవం తనకున్నదని, ఒక సామాన్య కార్యకర్తకు ఆయన ఇచ్చే గౌరవం ఎనలేనిదని ప్రశంసించారు. ఓ సామాన్య వ్యక్తికి ఆయన ఇచ్చే గౌరవం ఇతరులకు నేర్పిన క్రమశిక్షణ లాంటిదని కొనియాడారు.

ఆయనను ఇంత గొప్పస్థాయికి చేర్చిందని, అందుకే దేశ అత్యున్నత పదవిని అలంకరించడం వెంకయ్యనాయుడుకె సాధ్యమైందని ఆయన తెలిపారు. ఒక తెలుగువాడిగా తను ఎంతో గర్వపడుతున్నా అని శ్రీవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం అమరీందర్‌ మాట బేఖాతర్ ... పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ