విజయవాడ: రాజ్యసభకు నాలుగోసారి ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు విజయవాడలో సీఎం చంద్రబాబు సన్మానం చేశారు. తెలుగువాడిగా వెంకయ్య కేంద్ర మంత్రి పదవిని సమర్ధంగా నిర్వహించడమే కాకుండా, ప్రధాని మోడీ నుంచి ప్రంశంసలు అందుకుంటున్నారని కొనియాడారు.
ఏపీ పునర్నిర్మాణంలో వెంకయ్య కీలక పాత్ర పోషిస్తున్నారని, మరింత ప్రోత్సాహం నవ్యాంధ్రకు వెంకయ్య అందించాలని కోరారు. మరో పక్క వెంకయ్యనాయుడు తన కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా ఉత్తమ విద్యార్థులకు అవార్డులు అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.