కేజ్రీవాల్ ఇంకాస్త లోతుగా చూడాల్సిందన్న ఆప్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబా... పోస్ట్ పీకేసిన కేజ్రీ....
పోకిరి చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు ఓ మాట అంటాడు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. ఇప్పుడు అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి అలాగే కనబడుతోంది. ఓ విషయంలో నిర్ణయం తీసుకున్నాక దాని గురించి ఎవరైనా మాట్లాడితే కట్ చేసి ప
పోకిరి చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు ఓ మాట అంటాడు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. ఇప్పుడు అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి అలాగే కనబడుతోంది. ఓ విషయంలో నిర్ణయం తీసుకున్నాక దాని గురించి ఎవరైనా మాట్లాడితే కట్ చేసి పారేస్తున్నారు. తాజాగా ఢిల్లీ రవాణా శాఖామంత్రి గోపాల్ రాయ్ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ప్రీమియం బస్సు సర్వీసుల్లో మంత్రిగారు చేతివాటం చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో మంత్రి పదవి నుంచి వైదొలిగారు గోపాల్. కానీ తను ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కానీ సీఎం ఒత్తిడి కారణంగా ఆయన దిగిపోయారన్నది బహిరంగ రహస్యమే. దీనిపై ఆప్ అధికార ప్రతినిధి అల్కా లాంబా నేరుగా కేజ్రీపైనే గురిపెట్టి మాట్లాడేశారు.
అవినీతి జరిగిందంటూ విమర్శలు రాగానే తొలగించి ఉండాల్సింది కాదనీ, మరికొంత లోతుగా చూస్తే బావుండేదని చెప్పుకొచ్చారు. ఈ మాటలు అలా ఆయన చెవిన పడ్డాయో లేదో... అల్కా లాంబాను అధికార ప్రతినిధి పోస్టు నుంచి కూడా తొలగించారు కేజ్రీవాల్. అదే మరి... ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరు మరి.