ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టు తీర్పువచ్చిన తర్వాతచదువు సంధ్యలు, విషయజ్ఞానంలేని, అవగాహనలేని కొందరు వైసీపీ నేతలు లేమెన్లలా మాట్లాడుతున్నారని, సిగ్గులేని అధికారపార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరుచూసి సిగ్గే సిగ్గుపడుతోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆ మంత్రి బయటతిరగడానికి వీల్లేదు, అతనిఆలోచనలు, భాషసరిగాలేవు, అతను అధికారులను బెదిరిస్తున్నాడని, అతనితీరు గర్హనీయమని చెప్పడం జరిగింది. దానిపై సదరు మంత్రి హైకోర్టుకి వెళితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీనేతలు ఎస్ఈసీకి చెంపదెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు.
వారికి తెలియని విషయమేమిటంటే, హైకోర్టు తీర్పు ఎస్ఈసీకి చెంపదెబ్బకాదు, మంత్రిపెద్దిరెడ్డికి చావుదెబ్బ అని గ్రహించకపోవడం హైకోర్టు తీర్పుచూశాక మంత్రిపెద్దిరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలన్న వర్ల, మంత్రి తప్పుడు మాట్లాడతారు, అసభ్యంగా మాట్లాడతారని భావించే కదాహైకోర్టు ఆయన్ని మీడియాముందు మాట్లాడవద్దని చెప్పిందన్నారు.
హైకోర్టు తీర్పుతో మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, కానీఆయనకు సిగ్గు,శరంలేవుకనుక చేయరని రామయ్య ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలకమిషనే సుప్రీం , అందులో ఎలాంటిసందేహం లేదని రామయ్య స్పష్టంచేశారు. మంత్రి తప్పుడువిధానాలు ప్రజలకు చెబుతాడనే ఆయన్ని మీడియా ముందు మాట్లాడొద్దని న్యాయస్థానం చెప్పిందన్నారు.
హైకోర్టు మంత్రిపెద్దిరెడ్డి ఆచెంప, ఈ చెంప వాయించినా కూడా, తగుదనమ్మా అంటూ తనదే పైచేయి అనిచెప్పుకోవడం సిగ్గుచేట న్నారు. పెద్దిరెడ్డికి నిజంగా నైతికతఅనేది ఉంటే, ఆయన తక్షణమే తనమంత్రిపదవికి రాజీనామా చేయాలన్నారు.
మంత్రి చేతగానిత నం, నైతికవిలువలకు ఆయన తిలోదకాలిచ్చినతీరు గురించి తాను మాట్లాడుతున్నానుతప్ప, ఎస్ఈసీని సమర్థించేలా మాట్లాడటం లేదని రామయ్య స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఒక్కసారి ఇటువంటి మంత్రి తన కేబినెట్ లో అవసరమా అని ఆలోచించాలన్న రామయ్య, మంత్రినోరు తెరవకుండా హైకోర్టు అతనినోటిని కుట్టేస్తే, దానిపై ముఖ్యమంత్రిగా ఆలోచనచేయాల్సిన బాధ్యత జగన్ పై లేదా అని రామయ్య ప్రశ్నించారు.
ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువలున్నా, తక్షణమే పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. అప్పుడైనా ముఖ్యమంత్రి మనోవికాసం పొందారని ప్రజలు గ్రహిస్తారన్నారు. ప్రెస్ ముందు నోరెత్తవద్దని, ఎన్నికల్లో వేలుపెట్టవద్దని హైకోర్టు చాలా స్పష్టంగా పెద్దిరెడ్డిని నిందించి, ఆయన చెంపలను వాయగొడితే, దానిగురించి మాట్లాడకుండా, ఎస్ఈసీకి హైకోర్టు చెంపదెబ్బ కొట్టిందని చెప్పుకోవడం సి గ్గుచేటు కాకఏమవుతుందన్నారు.
అవగాహనలేని, విషయ పరిజ్ఞానం లేనినోరు కాబట్టే, దాన్ని తెరవవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సిగ్గులేని మంత్రిపెద్దిరెడ్డి తీరుని చూసి సిగ్గే సిగ్గుపడుతోందని గ్రహించైనా జగన్ ఆయన్ని కేబినెట్ నుంచి తొల గించాలన్నారు. అలా కాకుండా హైకోర్టు తీర్పుని పట్టించుకోకుండా మనకేంటి సిగ్గు అంటూ ముఖ్యమంత్రి, మంత్రి చెట్టాపట్టాలేసుకు తిరుగుతారా అని రామయ్య దెప్పిపొడిచారు.
నోరుతెరిస్తే అసభ్యం గా, అసహ్యంగా, సిగ్గులేకుండా, విషయపరిజ్ఞానం లేకుండా మాట్లా డతాడు కాబట్టే, ఆయననోరు న్యాయస్థానం కుట్టేసిందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంత్రి పెద్దిరెడ్డిపై జగన్ చర్యలు తీసుకోకుంటే, ఈ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగంప్రకారం పనిచేయడం లేదని ప్రజలంతా భావించాల్సి ఉంటుందన్నారు.
మంత్రి పెద్దిరెడ్డిరామంచంద్రారెడ్డి జీవితం, ఎదుగుదల తప్పులపరంపర అన్న రామయ్య, అతను తప్పులనే మెట్లుగా చేసుకొని పైకొచ్చాడన్నారు అటువంటిమంత్రిపై చర్యలు తీసుకోవ డానికి జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నాడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మద్యంమాఫియాలకు కేంద్రబిందువుగా మారి, జడ్జిరామకృష్ణను బెదిరించడం, దళితయువకుడు ఓంప్రతాప్ చావుకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడు తున్నాడన్నారు. అతనిపై చర్యలు తీసుకుంటే, తన ప్రభుత్వానికి ఏమైనా గడబిడఅవుతుందనే మీమాంసలో ముఖ్యమంత్రి ఉన్నాడా అని రామయ్య సందేహం వెలిబుచ్చారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా సాగేలా ముఖ్యమంత్రి డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని, అధికారులు, మంత్రులు ఎవరి విధినిర్వహణ వారుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిగ్గుఎగ్గూ లేకుండా నోరు మూసుకొని తిరగమనిహైకోర్టు మంత్రికి చెబితే, అతను ఏమాత్రం సిగ్గులేకుండా తనదే పైచేయి అన్నట్లు మాట్లాడుతున్నాడని, అటువంటి వ్యక్తిపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటాడన్నారు.
ఎస్ఈసీ రమేశ్ కుమార్, ఈ విధంగా నేరాలు-ఘోరాలకు అలవా టుపడినవారంతా, ఇలానే ప్రవర్తిస్తుంటారని గ్రహించాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నోరుమూసుకొని కూర్చోవాలని చెప్పడంతోపాటు, ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పిన న్యాయస్థానం, ఆయన్ని ఇంటికే పరిమితంచేసుంటే ప్రజలంతా సంతోషపడేవారన్నారు. అప్పుడే న్యాయంసంపూర్ణంగా జరిగినట్లుగా అందరూ భావించేవారన్నారు.
కొందరు వ్యక్తులను బైండోవర్ చేస్తున్న పోలీసుల మాదిరే, హైకోర్టు కూడా మంత్రిని ఇంటికే పరిమితం చేసుంటే బాగుండేదని రామయ్య అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికతఉన్నా, తక్షణమే పెద్దిరెడ్డిని తన కేటినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పెద్దిరెడ్డిని ఉద్దేశించి హైకోర్టు వెలువరించినతీర్పుపై సిగ్గులేని వైసీపీనేతలు ఏవిధంగా సిగ్గే సిగ్గుపడేలా మాట్లాడారో గ్రహిస్తే మంచిదన్నారు.
గవర్నర్ కూడా తనబాధ్యతను ఉపయోగించి, ఆయనకున్న హక్కులను ఉపయోగించి మంత్రిపెద్దిరెడ్డిపై చర్యలు తీసకోవాలని రామయ్య విజ్ఞప్తిచేశారు. మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి గవర్నర్ డిస్మిస్ చేయాలన్నారు. నేనెవర్నీ లెక్కచేయను, ఏదైనా మాట్లాడతాను అన్నచిలుక హైకోర్టు తీర్పువచ్చాక భయపడిందని అర్థమవుతోందన్నారు.
కోర్టుతీర్పును ధిక్కరించి, పెద్దిరెడ్డి నిస్సిగ్గుగా బయటకువచ్చి, ప్రవర్తిస్తే, అతను చేసే సంజ్ఞలు, హావ భావాలను పాత్రికేయులు, ప్రజలు నిశితంగా గమనించాలని, ఆయన నడత, నడకపై కూడా ఎస్ఈసీ నిఘా పెట్టాలని రామయ్య కోరారు.
హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పుకుంటున్న వైసీపీనేతలను చూస్తుంటే, భార్యచేతిలో తన్నులు తిని బయటకువచ్చి వీరుడునని చెప్పుకునే వ్యక్తి తీరులా ఉందని రామయ్య గేలిచేశారు. రాజకీయనాయకుడికి కీలకమైనది నోరేనని, అదికుట్టేశాక, అతను హావభావాలకు పరిమి తమవుతాడని, వాటిపై కూడా ఎస్ఈసీ ఒకకన్నేసి ఉంచితే మంచిదని రామయ్య సూచించారు.