Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎర్ర తువాలు వేసుకోవద్దని చెప్పడానికీ మీరెవరు? వంగా గీతకు నాగబాబు కౌంటర్

red towel

ఠాగూర్

, సోమవారం, 13 మే 2024 (15:35 IST)
పిఠాపురంలో ఎర్ర కండువా ధరించి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వ్యక్తికి ఈ స్థానంలో వైకాపా తరపున పోటీ చేస్తున్న వంగా గీత తీవ్ర అభ్యంతరం తెలిపారు. అది ఓటర్లను ప్రభావితం చేసే చర్యగా పేర్కొన్నారు. దీనికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఎర్ర తువాలు కాశీ తువ్వాలు అంటారన్న ఆయన గుర్తు చేశారు. 
 
అది ధరించే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుందని చెప్పారు. ఆ తువ్వాలను కష్టం చేసుకునే ప్రతి కార్మికుడు ధరించవచ్చని తెలిపారు. ఆ తువ్వాలును వేసుకునే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుంది అని నాగబాబు స్పష్టం చేశారు. ఆ తువ్వాలును అడ్డుకోవడం అనేది చట్ట వ్యతిరేకం  అవుతుందని, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ వంగా గీతకు కౌంటర్ ఇచ్చారు. 
 
కాగా, ఎర్రుతువాలు వేసుకున్న వ్యక్తి ఇది గుడ్డ అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వంగా గీతతో పాటు అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గన్నవరంలో గరంగరం : టీడీపీ వర్సెస్ వైకాపా అభ్యర్థుల వర్గీయుల మధ్య తోపులాట