ఏలూరు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖపట్టణం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఇకపై ఏలూరు రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుందని తెలిపింది. ఇది అదనపు స్టాప్. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
విశాఖపట్టణం - సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాఫ్ కూడా లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇపుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్ద వెసులుబాటు కలగనుంది.
ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఏలూరుకు 9.49 గంటలుక చేరుకుంది. అటు విశాఖపట్టణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి ఏలూరుకు సాయంత్రం 5.55 గటంలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్ రైలు ఆగి వెళ్లేలా అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.