Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉయ్యాలవాడ కనకమహాలక్ష్మి హోటల్‌కు రమ్మంది... లోనికెళ్లగానే గడియపెట్టి అది చేయమని బెదిరించింది...

నిజం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎంత మేలు చేస్తాయో అదే సమయంలో అవి కీడు కూడా చేస్తున్నాయి. ఈ క్రింది విషయాన్ని తెలుసుకుంటే ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కావాలని ఆరాటపడేవారితో ఎంత జాగ్రత్తగా వుండాలో అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాకు ఈపూరుప

Advertiesment
uyyalavada kanakamahalakshmi
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (21:39 IST)
నిజం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎంత మేలు చేస్తాయో అదే సమయంలో అవి కీడు కూడా చేస్తున్నాయి. ఈ క్రింది విషయాన్ని తెలుసుకుంటే ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కావాలని ఆరాటపడేవారితో ఎంత జాగ్రత్తగా వుండాలో అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాకు ఈపూరుపాలెంకు చెందిన సురేష్ అనే యువకుడు ఇన్ఫోసిస్ కంపెనీలో జావా డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి ఫేస్ బుక్ కు ఓ రోజు అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆమె ఫోటోను చూడగానే యువకుడు ఓకే చెప్పేశాడు. ఇక ఆ తర్వాత ఫేస్ బుక్, వాట్స్ యాప్ చాటింగ్ అంతులేకుండా జరిగిపోయింది.
 
ఆ క్రమంలో తన పేరు పల్లవి అని చెప్పిందామె. ఆ తర్వాత కొద్దిరోజులకే తన పేరు పల్లవి కాదు, మౌనిక అని చెప్పడమే కాకుండా తన తండ్రి ఒంగోలు డిఎస్పీగా పనిచేస్తున్నారంటూ నమ్మించింది. మరికొద్ది రోజులకు నిన్ను ప్రేమిస్తున్నా... నువ్వు లేకుండా బతకలేను అంటూ చెప్పింది. మరో రోజు తనకు ఇష్టం లేని పెళ్లి చేసేందుకు పెద్దలు ఒత్తిడి చేస్తున్నారనీ, ఆత్మహత్యా యత్నం చేసినట్లు చెప్పింది. దాంతో సురేష్ బెదిరిపోయాడు. ఎంతో కష్టపడి ఒంగోలు డీఎస్పీ ఫోన్ నెంబరు తీసుకుని ఆయనకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని ఆయనతో చెప్పాడు. దాంతో డీఎస్పీ తనకు కుమార్తెలే లేరని చెప్పడంతో అర్థం కాలేదతడికి.
 
ఐనా ఆమెను అనుమానించలేదు. తను ప్రేమలో పడినందుకు తన తండ్రి కోపంతో అలా చెపుతున్నాడని నమ్మించింది. ఈ క్రమంలో తను హైదరాబాదు హోటల్లో వున్నాననీ, వెంటనే రావాలంటూ ఫోన్ చేసింది. అమ్మాయి చెప్పిన హోటల్ గదికి వెళ్లగానే అతడికి చుక్కలు కనిపించాయి. ఫేస్ బుక్కులో వున్న ఫోటోకి ఆమెకు ఏమాత్రం పోలికే లేదు. నువ్వు కాదని అతడు వెనుదిరిగే లోపే గది తలుపులను ఓ వృద్ధురాలు లాక్ చేసేసింది. దాంతో సదరు యువతి... తనను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదంటే గొడవ చేస్తానని బెదిరించింది. దీనితో చేసేది లేక అతడు ఆమెకు దండ వేయడం, ఆమె ఇతడికి వేయడం అయిపోయింది. 
 
ఇక అతడిని బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రైలు ఎక్కించారు. ఆ సమయంలో అతడు విషయాన్ని తన తల్లిదండ్రులకు చేరవేశాడు. వారు హుటాహుటిన సికింద్రాబాద్ స్టేషనుకు చేరుకుని ఆమెను నిలదీశారు. దాంతో పక్క స్టేషనులోనే దిగిపోయింది ఆమె. వీరు నేరుగా ప్రకాశం జిల్లా చీరాలకు వెళ్లి తమ కుమారుడిని మోసం చేసిన అమ్మాయిపై కేసు పెట్టారు. కానీ ఈలోపే ఆ కిలాడి లేడి వీరిపై కేసు పెట్టేసింది హైదరాబాదులో. తనను కులం పేరుతో దూషించారనీ, తనను దుర్భాషలాడారంటూ కేసు పెట్టింది. 
 
దీంతో పోలీసులు మరికాస్త లోతుగా ఆమె గురించి వాకబు చేయగా ఆమె పేరు ఉయ్యాలవాడ కనకమహాలక్ష్మి అని తేలింది. ఈమె చేతిలో మోసపోయినవారి చిట్టా పెద్దదిగానే వున్నట్లు కనుగొన్నారు. యువకులకు వల వేసి నమ్మించి పెద్దమొత్తంలో డబ్బు, బంగారంతో పరార్ అవుతుందనీ, ఈమెపై తిరుపతిలో మూడు కేసులున్నాయని తేల్చారు. ఇలాంటి మాయలేడీల పట్ల జాగ్రత్తగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన గుంటూరు బాలిక మానస