Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...

Advertiesment
Uttarakhand
అడవుల్లో ఉండాల్సిన గజరాజులు ఊళ్లలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నానా బీభత్సం సృష్టించడమేకాకుండా, తనకు అడ్డొచ్చిన వారిని తొండంతో చుట్టి నేలకేసికొడుతుంది. కాళ్లతో తొక్కి చంపేసింది. అలాంటి సంఘటన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ మదపుటేనుగు గ్రామంలోకి దూసుకొచ్చింది. జనం మీద పడింది. తరిమి తరిమి కొట్టింది. దొరికిన ఓ వ్యక్తిని కాలుకింద నలిపేసి చంపేసింది. ఆ ఏనుగు బీభత్సం గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనం గజగజా వణికిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆగమేఘాలపై గ్రామానికి వచ్చారు. మదపుటేనుగును అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఏనుగు వేట ప్రారంభించారు. మొత్తానికి దాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. 
 
ఏనుగుకు మత్తుమందు ఇవ్వడంతో మిన్నకుండిపోయింది. ఆ తర్వాత తాళ్లతో కట్టి.. తమ వాహనంలో మరో చోటకు తరలించారు. అక్కడ నుంచి ఏనుగుల శిబిరంలో దానిని వదిలేస్తామని… దాని ప్రవర్తనను గమనించి తర్వాత చర్యలు తీసుకుంటామని హరిద్వార్ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవోకేలో చైనా బసు సర్వీసు... కరాచీలో డ్రాగన్ ఎంబసీపై ఉగ్రవాదుల దాడి